సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా - టార్గెట్ ఫిక్స్ : అందరి చూపు ఇటు వైపే..!!
ముఖ్యమంత్రి విశాఖ నాయకత్వంలో విశాఖ కేంద్రంగా తీసుకొనే నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. నాలుగేళ్ల పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. తన పాలనలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో నిరూపించుకొనే అవకాశం వచ్చింది. విశాఖ కేంద్రంగా ఇప్పుడు అందరి చూపు ఏపీ పైనే ఉంది. జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యే సదస్సులో ఏపీ సాధిస్తున్న పురోగతి వివరించనున్నారు. ఏపీలో పెట్టబడులకు ఉన్న అవకాశాలతో వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేయనున్నారు. గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు విశాఖ సిద్ధమవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు..ఒప్పందాలకు విశాఖ వేదిక కానుంది.

అంతర్జాతీయ వేదికకు సిద్దమైన సాగర తీరం..
విశాఖ కేంద్రంగా జరిగే గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతోంది. జాతీయ- అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు విశాఖ ఆహ్వానం పలుకుతోంది. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో..సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వేదికగా కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరంతో పాటుగా పారిశ్రామిక కారిడార్లు..పోర్టులు..ఏయిర్ పోర్టులు..అందుబాటులో ఉన్న భూములు..పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పాలసీలను ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక దిగ్గజాలకు వివరించనుంది. ఫ్రెండ్లీ గవర్నెన్స్ తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచేదీ ఈ సదస్సు ద్వారా వెల్లడించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ఏపీకి పెద్ద మొత్తంలో పెట్టుబడుల తో పరిశ్రమలు..ఉపాధి కల్పన కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా
ఏపీ 2021-22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (జీఎస్‌డీపీ) 11.43 శాతం వృద్ధితో రూ.7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78 శాతం వృద్ధి నమోదైంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతోపాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022-27, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ 2020-25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ-22, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020-25, టూరిజం పాలసీ 2020-25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021-26.. ఇలా అనేక పారిశ్రామిక పాలసీను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్టమని విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వం వివరించేందకు సిద్దమైంది.
కీలక లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు
ఈ సదస్సు కోసం ఏపీ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో రోడ్ షో లు నిర్వహించింది .గెట్ టు గెదర్ ఏర్పాటు చేసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. కేంద్ర మంత్రులు ఈ సదస్సు కోసం తరలి వస్తున్నారు. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలు..కేంద్రం - రాష్ట్రం మధ్య సన్నిహిత సంబంధాలను వివరించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కేఎం బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారని సమాచారం. దాదాపు 2500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు ద్వారా ఏపీ పెట్టుబడులకు చిరునామాగా మార్చాలనేది సీఎం జగన్ లక్ష్యం. మూడు విభాగాలుగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఫౌండేషన్ స్టోన్స్.కంపెనీల ప్రారంభం.. ఒప్పందాలు ఇలా..మూడు విభాగాలుగా సదస్సు కొనసాగనుంది. దాదాపుగా లక్షా 85 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications