రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - 53.53 లక్షల మంది ఖాతాల్లో నిధుల జమ..!!
ముఖ్యమంత్రి జగన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు నిధులను విడుదల చేయనున్నారు. రేపు (మంగళవారం) పుట్టపర్తి కేంద్రంగా సీఎం జగన్ ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాన్నారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..రాజకీయ అంశాల పైన సీఎం కీలక సందేశం ఇవ్వనున్నారు.
రైతు భరోసా నిధులు
ముఖ్యమంత్రి ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధుల విడుదలకు నిర్ణయించారు. రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద రేపు రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. అందులో భాగంగా రేపు 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శిస్తున్నారు.

పుట్టపర్తి కేంద్రంగా
రైతు భరోసా కింద ఏడాదికి ప్రతీ రైతు ఖాతాల్లో మూడు విడతలుగా రూ 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ఏడాది తొలి విడతలో రూ 7,500 చొప్పున 53.53 లక్షల మంది ఖాతాల్లో 3,942.95 కోట్ల మేర సాయం అందించింది. ఇప్పుడు రెండో విడతలో భాగంగా 53.53 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ 2,204.77 కోట్లు విడదల చేయనున్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో 52,57,263 మంది రైతులు ఈ పధం కింద అర్హత సాధించారు. వారిలో 50,19,187 మంది భూ యజమానులు కాగా..1,46,324 మంది కౌలు దారులు ఉన్నారు. వీరితో పాటుగా 91,752 మంది అటవీ భూములు ఉన్నవారున్నారు. వీరికి రూ 7500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది.

రాజకీయ నిర్ణయాలు
ఇక..రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూనే సీఎం జగన్ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలపై స్పందించే అవకావం ఉంది. చంద్రబాబు మధ్యంతర బెయి్ పైన విడుద కావటం..అదే విధంగా పవన్ తెలంగాణలో బీజేపీతో పొత్తు..ఏపీలో టీడీపీతో పొత్తు అంశాల పైన ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష...సామాజిక బస్సు యాత్ర గురించి సీఎం మాట్లాడే అవకాశం ఉంది. రాయలసీమ వేదికగా సీఎం జగన్ రైతుల అంశాల పైన మాట్లాడటంతో పాటుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తుండటంతో.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications