చంద్రబాబు పథకాల పై జగన్ బ్రహ్మాస్త్రం - 48 నెలల సాక్షిగా, ఆట మొదలు..!!
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయింది. విపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం అయిన తరువాత జగన్ అమలు చేస్తున్నారు. మాట ఇస్తే నిలబెట్టుకోవటం తన తండ్రి నుంచి వారసత్వంగా చెప్పుకొచ్చారు. జగన్ చెప్పారంటే చేస్తారంతే అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ఆ విశ్వసనీయతే ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బ్రహ్మాస్త్రంగా మారుతోంది. జగన్ సంక్షేమ బలం ఎదుర్కోవాలంటే తాను సంక్షేమ బాట పట్టక తప్పదని చంద్రబాబు గుర్తించారు. ప్రకటించారు. దీంతో, ఇప్పుడే అసలు ఆట మొదలైంది.
పార్టీ ప్రారంభం నుంచే:వైఎస్ పార్టీ ప్రారంభమే ఒక సంచలనం. 2014 ఎన్నికల్లో అయిదు లక్షల ఓట్ల తేడాతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల ముందే ఏడాదిన్నార కాలం ప్రజలతో మమేకం అవుతూ 3,648 కిలో మీటర్ల పాదయాత్రతో కొత్త రికార్డు స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టారు. టీడీపీకి ఊహించని విధంగా పరాజయం మిగిలింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్వసనీయత నిలబెట్టుకొనేందుకు ప్రయత్నించారు. కరోనా..ఆర్దిక కష్టాల సమయంలోనూ పథకాల అమలు ఆపలేదు. సంక్షేమం - సామాజిక న్యాయం ప్రధాన అంశాలుగా పాలన సాగించారు. కేబినెట్‌లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు.

48 నెలలు..2 లక్షల కోట్ల సంక్షేమం:ఈ నాలుగేళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల 15 వేల కోట్లు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసారు. 2014లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవటం పైన జగన్ ప్రధానంగా ప్రచారం చేసారు. తన పైన అటువంటి ప్రచారానికి ఆస్కారం లేకుండా పాలన సాగించారు. ఈ నాలుగేళ్ల కాలంలో జరిగిన ఉప ఎన్నికలు..స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పడు వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ ఒంటరి పోరాటానికి సిద్దమయ్యారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం గెలిపిస్తుందని నమ్ముతున్నారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు పై బ్రహ్మాస్త్రం:జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పైన విమర్శలు చేసిన చంద్రబాబు..ఇప్పుడు సంక్షేమం ఎంత బలంగా జనంలోకి వెళ్లిందో గ్రహంచారు. సంక్షేమంతో తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసారు. కానీ, అసలు చెప్పిన మాట అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదంటూ టీడీపీ అధ్యక్షుడు విశ్వసనీయత లేని నేతగా వైసీపీ గత అనుభవాలను వివరిస్తూ ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు విశ్వసనీయత చంద్రబాబు పై జగన్ బ్రహ్మాస్త్రంగా మారుతోంది. సంక్షేమంలో చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఈ 48 నెలల కాల పాలనలో 98.5 శాతం హామీలను అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. సంక్షేమంలో మహిళలకే అగ్రపీఠం వేసారు. ప్రతీ పథకంలోనూ మహిళలనే లబ్దిదారులను చేసారు.

పాలనా పరమైన నిర్ణయాలు:ఇక, పాలనా పరంగా వాలంటీరు వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కంటే మిన్నగా తీర్చిదిద్ది ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు-నేడు ద్వారా ఆధునీకరించడంతోపాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. అర్హతే ప్రమాణికంగా, వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. విశాఖలో సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్ కు పారిశ్రామిక దిగ్గజాలు తరలి వచ్చారు. రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇక, ఇప్పుడు వై నాట్ 175 నినాదంతో జగన్ రానున్న ఎన్నికల్లొ మరో సారి విజయం సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.-












Click it and Unblock the Notifications