రేపు వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ తన హామీల విషయంలో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు పథకాల లబ్ది దారులకు నిధులను విడుదల చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ నిజాంపట్నంలో పర్యటించనున్నారు. అక్కడ వైయస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు. సభలో ప్రసంగించనున్నారు.
నిజాంపట్నం పర్యటన:ముఖ్యమంత్రి జగన్ వరసుగా ఈ ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను నిజాంపట్నం కేంద్రంగా విడుదల చేయనున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీల పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేయని మంచిని తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని వివరిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. లబ్ది దారులే సైనికులుగా మారాలని సూచిస్తున్నారు. పొరపాటున ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. పేదలు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదని అప్రమత్తం చేస్తున్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే..ప్రజలకు తాను చెప్పదలచుకున్న అంశాలను స్పష్టం చేస్తున్నారు.

నిధులు విడుదల:ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వైయస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ఈ పథకాన్ని సీఎం జగన్ వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈపథకం ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తారు. కాగా పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
సీఎం జగన్ సందేశం:ఇప్పటివరకు వైయస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా రూ 418 కోట్లు ప్రభుత్వం సాయం చేసింది. 23,458 మంది మత్య్సకార కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ తరహా సాయం అందిస్తున్నారు. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే గంగ పుత్రులకు సాయం అందించింది. నాలుగేళ్ల కాలంలోనే వైసీపీ ప్రభుత్వం రూ 418 కోట్లు సాయంగా ఇచ్చింది. అందులో భాగంగా సీఎం జగన్ ఈ నెల 16వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేస్తారు. గత నాలుగేళ్ల మాదిరిగానే వరుసగా ఐదో ఏడాది కూడా వేటపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications