సీఎం జగన్ బర్త్ డే ఈ సారి సంథింగ్ స్పెషల్ - అసలు కారణం ఇదే..!!
డిసెంబర్ 21. ముఖ్యమంత్రి జగన్ జన్మదినం. ఈ సారి సీఎం పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను మరింత వినూత్నంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యారు. ఇప్పటికే మంత్రి రోజా సీఎం జన్మదినోత్సవాల కోసం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ధూం ధాం డాన్స్ లో అదరగొడుతున్నారు. రక్తదానం కోసం అభిమానులు ముందకొస్తున్నారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా పోస్టల్ కార్డు ద్వారా శుభాకాంక్షలు చెప్పే అవకాశం కల్పించారు. ఇదే రోజున సీఎం జగన్ విద్యార్ధులకు విద్యార్ధుకుల టాబ్ లు పంపిణి చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే జన్మదిన వేడుకలు ఆరంభమయ్యాయి.

సీఎం జగన్ జన్మదినం నాడు..
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21న జన్మదినం జరుపుకోనున్నారు. జగన్ 50వ జన్మదినం ఈ సారి ప్రత్యేకత. దీంతో, పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువా నాలుగో జన్మదినం. ఈ రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు పార్టీ యంత్రాంగా సిద్దమైంది. అందులో భాగంగా భారీగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఈ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. గతంలో పార్టీ కార్యకర్తలు 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని వివరించారు ఈసారి వైయస్‌ఆర్ సీపీ బ్లడ్ డొనేషన్.కామ్ పేరిట వెబ్‌సైట్ ప్రారంభించామని చెప్పారు. వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉంటుందని సజ్జల వెల్లడించారు. ఇప్పటికే ఈ వెబ్ సైట్ ద్వారా భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అదే విధంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలు
ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా.. నేడు పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలు ప్రారంభించారు. మంత్రి రోజా తన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో సీఎం జగన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అందులో పాల్గొన్నారు. డాన్స్ లతో హోరెత్తించారు. స్వయంగా ఆట పోటీల్లో పాల్గొని కార్యక్రమాల్లో జోష్ పెంచారు. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, విశాఖల్లో జోనల్ పోటీలు జరగ్గా, 21న విజయవాడలో బహుమతుల ప్రధానోత్సవంలో సీఎం పాల్గొంటారు. 20వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం, 21న పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 21న ముఖ్యమంత్రి జగన్ విద్యార్ధులకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టాబ్ ల పంపిణీ ప్రారంభించనున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు - ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడతారు.

21న ప్రత్యేక కార్యక్రమాలతో శుభాకాంక్షలు
ఈ నెల21న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో రక్తదాన శిబిరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో ఈ సారి సంక్షేమ పథకాల లబ్ది దారులను మమేకం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను సిద్దం చేసారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే పది రూపాయలు చెల్లిస్తే నేరుగా జగన్ కి శుభాకాంక్షలు పంపే ఈ పోస్ట్ అవకాశాన్ని కల్పించారు. ప్రతీ ఏటా సీఎం జగన్ జన్మదినం నాడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్ని ప్రముఖ పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ లో ప్రత్యేకార్షణగా నిలుస్తారు. టీటీడీ నుంచి అర్చకులు సీఎంను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదం అందిస్తారు. ఈ సారి అదే విధంగా నిర్వహించనున్నారు. అయితే, గతం కంటే భిన్నంగా..ఘనంగా ఈ సారి సీఎం జగన్ జన్మదినం నిర్వహిందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications