సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే - ఉద్దానానికి ఊపిరి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం మారుతోంది. అధికారం నిలబెట్టుకోవాలనేది సీఎం జగన్ లక్ష్యం. నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా చంద్రబాబు - పవన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఆకర్షణీయ హామీలు.. జగన్ అన్నింటా ఫెయిల్ అంటూ ప్రచారం తో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ తన విశ్వసనీయత పెంచుకోవటంలో సక్సెస్ అవుతున్నారు. జగన్ చెప్పాడంతే చేస్తాడంతే అనే విధంగా వ్యవహరిస్తూ..ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతున్నారు.
చెప్పాడంటే చేస్తాడంతే
జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి విశ్వసనీయత నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు..నవరత్నాల అమలుకు తొలి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా సమయంలోనూ ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు.

రాష్ట్రంలో 87 శాతం మందికి అందుతున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రతిపక్షాలు జగన్ సంక్షేమానికి మంచి హామీలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ..జగన్ నాడు 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు -పవన్ ఇచ్చిన హామీలు విస్మరించి..ప్రజలను మోసం చేసారంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి హామీలకు విలువ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశ్వసనీయత పెరిగేలా
అందులో భాగంగా తాజాగా తీసుకున్న నిర్ణయాలు జగన్ కు ఎన్నికల వేళ సక్సెస్ రూట్ గా మారుతున్నాయి. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉద్దానం పైన పవన్ హామీలు ఇచ్చారు. చంద్రబాబు తో చర్చించారు. కానీ, ఫలితం కనిపించలేదు. జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. ప్రారంభానికి సిద్దమైంది.

నాలుగు దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని ఉద్దానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోస్తున్నారు.ఉద్దానం ప్రాతంంలో దాదాపు సగం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవాళ్లే. జగన్ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా ఈ సమస్యపై ఫోకస్ చేసింది. అక్కడి కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తూనే..వారి కష్టం తీర్చేందుకుతాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొంది. ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీరు అందించేందుకు 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పధకం ఏర్పాటు చేసింది.

ఉద్దానంకు జగన్ ఊపిరి
ఇందులో భాగంగా ఉద్దానం ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని పైపులైన్ ద్వారా తరలిస్తారు. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఇక్కడ్నించి 132 కిలోమీటర్ల పైపులైను ద్వారా ఉద్దానం చివరి ప్రాంతం ఇఛ్చాపురం వరకూ అందరికీ రక్షిత మంచి నీరు అందిస్తారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.

పలాస నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రక్షిత మంచి నీరు అందుతుంది. కిడ్నీ వ్యాధులు నెమ్మదిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. అధికారంలో రాగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ నెల 15న ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దీని ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనేది నిరూపించుకుంటున్నారు. ఈ ఇమేజ్ ఎన్నికల వేళ జగన్ కు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications