ఏపీలో కేసీఆర్ ప్లాన్ ఇదే- టార్గెట్ జగన్ ఓటు బ్యాంకు ! బీజేపీ కోరుకుంటోంది ఇదేనా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై వ్యతిరేకతతో ప్రారంభించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ త్వరలో ఏపీలో అడుగుపెట్టబోతోంది. విజయవాడలో అతి త్వరలో కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. తద్వారా ఏపీలో బీఆర్ఎస్ ఉనికిని చాటుకోబోతోంది. అయితే ఏపీలో జగన్ వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన వంటి పార్టీలు కూడా బీజేపీకి మద్దతిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ రాకతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారే అవకాశముంది. ముఖ్యంగా జగన్ ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ఏపీలో చేసే రాజకీయమే ఇందుకు కేంద్రం కానుంది.

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ

కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ త్వరలో ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, ఇంకా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికలకు కూడా సమయం తక్కువగా ఉండటంతో కేసీఆర్.. పొరుగు రాష్ట్రమైన ఏపీలో విజయవాడ బహిరంగసభతో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఏపీ-తెలంగాణ భాయ్ భాయ్ వంటి నినాదాలు తెరపైకి రాబోతున్నాయి. అందరూ తెలుగువాళ్లే కాబట్టి ఇందులో కేసీఆర్ కు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇక్కడి రాజకీయ సమీకరణాలపై బీఆర్ఎస్ చూపే ప్రభావం కచ్చితంగా ఏపీ పార్టీలకు భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టించడం ఖాయం.

జగన్ ఓటుబ్యాంకుతో కేసీఆర్ రాజకీయం

జగన్ ఓటుబ్యాంకుతో కేసీఆర్ రాజకీయం

ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేస్తున్నారు. వీరికే అన్ని పథకాల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే వీరిలో ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు గతంలో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన వారే. బీసీలు టీడీపీకి మద్దతిచ్చిన చరిత్రఉంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు వైసీపీకి అండగా నిలిచారు. ఇప్పుడు బీసీల్ని మినహాయిస్తే ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు జగన్ కు రెగ్యులర్ ఓటు బ్యాంకుగా చెప్పుకోవచ్చు. దీంతో వీరినే టార్గెట్ చేస్తూ కేసీఆర్ బీఆర్ఎస్ రాజకీయానికి తెరదీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే తన మిత్రుడిగా ఉన్న ఓవైసీని రంగంలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓవైసీ అండతో ముస్లింలకు గురి ?

ఓవైసీ అండతో ముస్లింలకు గురి ?


తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు నమ్మకమైన మిత్రుడిగా ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఇప్పటివరకూ ఏపీలో ఎంట్రీ ఇవ్వలేదు. కానీ హైదరాబాద్ లో ఉంటూనే ఇక్కడి ముస్లిం నేతలతో టచ్ లో ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ సిద్దం చేయగానే.. ఓవైసీ కూడా హైదరాబాద్ నుంచే చంద్రబాబుకు సవాళ్లు విసిరారు. ఇప్పుడు అదే ముస్లిం నేతల మద్దతుతో ఏపీలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు అండగా రాజకీయాల్ని మలుపుతిప్పేందుకు ఓవైసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడలో కేసీఆర్ పెట్టే బీఆర్ఎస్ సభకు కేసీఆర్ తో పాటు ఓవైసీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.

 బీజేపీ అదే కోరుకుంటోందా ?

బీజేపీ అదే కోరుకుంటోందా ?

ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మతపరమైన ఓట్ల ఏకీకరణకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు సైతం ఆ జాడ్యం పాకింది. వచ్చే ఏడాది జరిగే తెలంగాణలోనూ అదే రాజకీయానికి బీజేపీ తెరదీస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏపీలో ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్-ఓవైసీ ద్వయం ప్రయత్నిస్తే అప్పుడు ఏపీలోనూ మతపరమైన ఓట్ల ఏకీకరణకు కాషాయ పార్టీ ప్రయత్నించే అవకాశాలున్నాయి. అదే జరిగితే జగన్, చంద్రబాబు, పవన్ ఓటు బ్యాంకుల్లోనూ భారీ మార్పులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ముస్లింలతో పాటు, హిందువుల్లోనూ పలు సామాజిక వర్గ ఓట్లను కలిపి తమ రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చనే అంచనా ఉంది. బీజేపీకి కావాల్సింది కూడా అదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+