GVMCలో ఆస్తిపన్ను పెంపు రగడ- కౌన్సిల్ భేటీ రచ్చరచ్చ-మేయర్ వాకౌట్
ఏపీలో 15 శాతం మేర ఆస్తిపన్ను పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సర్కార్ నిర్ణయంపై ఇప్పటికే పలు చోట్ల విపక్షాలు నిరసనలు తెలుపుతుండగా..ఇవాళ విశాఖఫట్నంలోనూ అదే పరిస్ధితి ఎదురైంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్‌లో ఆస్తిపన్ను పెంపుకు నిరసనగా విపక్షాలు ఆందోళనకు దిగాయి.
GVMCలో ఆస్తిపన్ను పెంపు రగడ- కౌన్సిల్ భేటీ రచ్చరచ్చ-మేయర్ వాకౌట్ #GVMC #Andhrapradesh #Visakhapatnam pic.twitter.com/BmlUVjlIEr
— oneindiatelugu (@oneindiatelugu) June 23, 2021
ఇవాళ జరుగుతున్న విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో ఆస్తిపన్ను పెంపు రచ్చకు దారి తీసింది. ఆస్తిపన్ను పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతూ విపక్ష టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారు. మేయర్ గొలగాని హరికుమారి ఎంత నచ్చజెప్పినా వారు పట్టించుకోలేదు. అధికార వైసీపీ కార్పోరేటర్లు కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో విపక్ష కార్పోరేటర్ల నిరసనతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది. చివరికి విపక్ష సభ్యుల్ని నచ్చజెప్పే పరిస్ధితి లేకపోవడంతో మేయర్ హరికుమారి తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు జీవీఎంసీ కౌన్సల్ బయట నిరసనలు తెలిపారు. తన ఛాంబర్‌లో అన్ని పక్షాల ఫ్లోర్ లీటర్లలో చర్చలు జరుపుతున్నారు. ఆస్తిపన్ను పెంపు ప్రభుత్వ నిర్ణయమని, దాన్ని అమలు చేయడం మాత్రమే కౌన్సిల్ బాధ్యత అని, దీన్ని అర్ధం చేసుకోవాలని విపక్షాలకు చెప్తున్నారు. కౌన్సిల్ భేటీని అజెండా మేరకు కొనసాగించేందుకు అన్ని పక్షాలు సహకరించాలని మేయర్ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications