కోదండరామ్‌కు ఒయు సెగ: ఖాళీ గిన్నెలతో (పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు విద్యార్థుల ఆందోళన సెగ తాకింది. పోలవరంపై ఏర్పాటైన సదస్సులో పాల్గొనడానికి కోదండరామ్, తెలంగాణ అదనపు ఎజి శనివారంనాడు ఓయుకు వచ్చారు. వారిని విద్యార్థులు అడ్డుకున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్నారు.
శుక్రవారంనాడు కూడా విద్యార్థులు ఆందోళన చేశారు. వారి ఆందోళన శుక్రవారంనాడు వినూత్నంగా సాగింది. ఖాళీ గిన్నె చుట్టూ కూర్చుని వారు నిరసన వ్యక్తం చేశారు.

ఓయు ఆందోళన
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓయు విద్యార్థులు గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు.

ఓయు ఆందోళన
శుక్రవారంనాడు ఓయు విద్యార్థులు శుక్రవారంనాడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ గిన్నెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఓయు ఆందోళన
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తే తమకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయని, తమ భవిష్యత్తు దెబ్బ తింటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఓయులో ఆందోళన
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనతో గత కొద్ది రోజులుగా భగ్గుమంటోంది












Click it and Unblock the Notifications