హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవయవదానం: నాగార్జున ప్రతిజ్ఞ, రికార్డ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యశోద గ్రూపు హాస్పటల్స్, జీవన్‌దాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవయవదాన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నాగార్జున హాజరై ప్రతిజ్ఞ చేయించారు.

శనివారం మాదాపూర్ శిల్పకళావేదికలో యశోద ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమానికి అక్కినేని హాజరై మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై యశోద గ్రూపును అభినందించారు.

అవయవదానంపై ఎంతో చొరవ తీసుకుని నాగార్జున ప్రతిజ్ఞ చేయించటంతో ఆయన పలువురు అభినందనలు పొందారు. అవయవదానంతో ఏడుగురికి ప్రాణం పోసి, తాను చనిపోయిన తర్వాత కూడా జీవించే గొప్ప అవకాశం కలిగిందని నాగార్జున ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 అవయవదానం

అవయవదానం

మనిషి జీవించి ఉన్నపుడే శరీరానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, చనిపోయిన తర్విత కూడా మన శరీరంలోని అవయవాలకు అంతే ప్రాధాన్యత ఉంటుందని, మట్టిలో కలిసిపోయే అవయవాలు ఎంతో మందికి ప్రాణదానం చేస్తాయని నాగార్జున అన్నారు.

 అవయవదానం

అవయవదానం

ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన నిర్వాహకులైన యశోదా గ్రూపును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

 అవయవదానం

అవయవదానం

అనంతరం యశోద ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా జిఎస్ రావు మాట్లాడుతూ.. ప్రపంచంలో మన దేశం జనాభాలో ద్వితీయ స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు.

 అవయవదానం

అవయవదానం

అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేవలం ఆస్పత్రులు, స్వచ్చంథ సంస్థలపైనే గాక, ప్రతి ఒకరిపై ఉందన్నారు.

 అవయవదానం

అవయవదానం

అవయవదానం బృహత్ కార్యక్రమమని, ఈ విషయంలో అవగాహన అవసరమని, ఇందుకు యశోద గ్రూపు చొరవ అభినందనీయమని నాగార్జున అన్నారు.

 అవయవదానం

అవయవదానం

ఒక మిలియన్ జనాభాలో కేవలం 0.26 శాతం మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారని, అదే మన కంటే తక్కువ జనాభా ఉన్న అమెరికాలో 26 శాతం, స్పెయిన్లో 35 శాతం, క్రొయేషియాలో 36.5 సాతం ఏటా తమ అవయవాలు దానం చేస్తున్నారని నాగార్జున చెప్పారు.

 అవయవదానం

అవయవదానం

తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు కూడా చివరి నిమిషంలో అవయవదానానికి సిద్ధమయ్యారని, అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి అందుకు సహకరించదని వైద్యులు చెప్పారన్నారు.

 అవయవదానం

అవయవదానం

చివరకు తన తండ్రి గుండెలో అమర్చిన ఫేస్ మేకర్ దానం చేయాలని తమకు సూచించడంతో కేర్ ఆసుపత్రిలో దానిని అప్పగించామని నాగార్జున చెప్పారు.

 అవయవదానం

అవయవదానం

యశోద గ్రూపు అవయవదానం వంటి మంచి కార్యక్రమం గురించి చెప్పగానే తాను అంగీకరించానని, మీలో ఎవరు కోటీశ్వరుడు తదుపరి ఎపిసోడ్‌తో పాటు వచ్చే సినిమాల్లో ఈ విషయమై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తానని నాగార్జున అన్నారు.

 అవయవదానం

అవయవదానం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో అవయవదానంపై నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా 4,600 మంది తమ అవయవాలు దానం చేసినట్లు హామీ పత్రాలను సమర్పించారు. ఒక్కరోజులోనే ఇంతమంది ముందుకు రావడం ప్రపంచ రికార్డని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

English summary
In what could be a ray of hope for 671 patients, anxiously waiting for their turn for organ transplantation under 'Jeevandan' scheme in Telangana and Andhra Pradesh, 4,311 people pledged to donate their organs during an 'Organ Donation Drive' , held by Yashoda Hospitals and state-backed 'Jeevandhan' at Shilpakala Vedika in the city on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X