ప్రధాని చెప్పారనే ఉన్నాం: రాజీనామాలపై పళ్లం రాజు
రాజమండ్రి: ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ చెప్పినందు వల్లనే తాము రాజీనామాలను ఆమోదింపజేసుకోలేదని కేంద్ర మంత్రి పళ్లం రాజు చెప్పారు. సమైక్యాంధ్ర కోసం చివరి దాకా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ఆయన అన్నారు.
సోమవారం ఢిల్లీ నుంచి కాకినాడకు వచ్చిన పల్లంరాజుకు సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. దీంతో మంగళవారం పల్లం రాజు వీరవరంలోని మంత్రి తోట నర్సింహం స్వగృహంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశ మయ్యారు.

భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ కాంగ్రెస్‌లో కొనసాగితే ఎలా ఉంటుంది? పార్టీ మారితో భవిష్యత్ ఎలాంటుందన్న విషయాలపై ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు, కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం పళ్లంరాజు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications