పాన్ ఇండియా బాక్సాఫీస్ రూలర్.. ప్రభాస్
ప్రభాస్ పేరు వింటేనే బాక్సాఫీస్ బెంబేలెత్తుతోంది. డార్లింగ్ నుంచి సినిమా వస్తోందంటే చాలు.. అభిమానులు విడుదలరోజును పండగలా చేసుకుంటున్నారు. డార్లింగ్ అంటూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. పాన్ ఇండియా రూలర్ గా ప్రతి సినిమాకు రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్ క్రేజ్, ఇమేజ్ చూసి ఇతర కథానాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలు విజయవంతం కాకపోయినప్పటికీ మొదటిరోజు మాత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
ప్రభాస్ క్రేజ్ వల్లే ఆదిపురుష్ తొలిరోజే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించదని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమా విడుదలవుతోంది అంటే మొదటిరోజు రూ.100 కోట్లు ఖాయమనే లెక్క స్థిరపడింది. అన్నీ కలిసివచ్చి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయ్యారంటే ఆ సినిమాతో డార్లింగ్ సునామీని సృష్టించినట్లే. భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో అయితే తుఫాన్ మొదలైనట్లే. మొదటిరోజే మిలియన్ డాలర్స్ కు పైగా కలెక్షన్లను ఆదిపురుష్ సాధించింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు సాధించిన టాప్-6 సినిమాల్లో ప్రభాస్ సినిమాలే నాలుగున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఆదిపురుష్ రూ.140 నుంచి రూ.150 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంటుందన్నారు. ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న టాప్ 5 సినిమాల్లో ఆదిపురుష్ నాలుగు స్థానంలో నిలిచింది. రూ.225 కోట్లతో RRR మొదటిస్థానంలో బాహుబలి 2.. రూ.214 కోట్లు, కెజియఫ్ చాప్టర్ 2.. రూ.163 కోట్లు, ఆదిపురుష్ రూ.150 కోట్లు, సాహో రూ.126 కోట్లతో టాప్ 5 లిస్ట్‌లో చేరాయి. దీనిని బట్టి దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డార్లింగ్ నుంచి సినిమా వస్తోందంటూ మొదటిరోజు కలెక్షన్లు రూ.100 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి.












Click it and Unblock the Notifications