పారడైజ్‌లో నిమ్మగడ్డ పేరు: జగన్ కంపెనీలకు నిధులు ఇలా, నివ్వెరపోయే నిజాలు
Recommended Video

హైదరాబాద్/అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జీషీట్లలో నాలుగో దానిలో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు పారడైజ్ పత్రాల్లో వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.
ప్రసాద్ నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్స్ అప్లెబీ రికార్డుల్లో ఉన్నాయని ఐసీఐజేలో సభ్యత్వం ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. 2016లో ఐసీఐజే ప్రచురించిన బహమాస్ లీక్స్ పత్రాల్లోనూ నిమ్మగడ్డ పేరుంది.

వారితో నిమ్మగడ్డకు సంబంధాలు
రస్ అల్ ఖైమా పెట్టుబడులు సంస్థ (రాకియా), ఓడరేవు-నిజాంపట్నం రేవు పారిశ్రామిక కారిడార్ (వాన్‌పిక్), లెబనాన్-స్విస్ జాతీయుడైన రాకియా సీఈవో ఖతేర్ మస్సాద్‌లతో నిమ్మగడ్డకు ఉన్న సంబంధాలను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

నిమ్మగడ్డ - జగన్.. నీకిది నాకది
ఆర్థిక శాఖ అభ్యంతరాలను పక్కన పెట్టి 22 వేల ఎకరాల భూముల్ని ప్రసాద్‌కు కట్టబెట్టినట్లు 2012లోనే సీబీఐ 177 పేజీల ఛార్జీషీటులో పేర్కొంది. భూమిపరంగా పొందిన లబ్ధికి ప్రతిఫలంగా క్విడ్ ప్రో కో ప్రాతిపదికన జగన్ కంపెనీల్లో రూ.854 కోట్ల పెట్టుబడుల్ని నిమ్మగడ్డ పెట్టినట్లు తెలిపింది.

ఇవన్నీ తాజా పత్రాల్లో
దీనిలో రూ.140 కోట్లను మారిషస్ కంపెనీల ద్వారా తరలించినట్లు సీబీఐ 2013లో కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం వాన్‌పిక్ భూముల కేటాయింపును రద్దు చేసింది. ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తాలు ఏయే కంపెనీలకు వచ్చిందీ పారడైజ్ పత్రాల్లో ఉంది.

నిమ్మగడ్డ కంపెనీల భాగస్వామ్యంతో ఒప్పందం
పారడైజ్ పత్రాల్లో వివరాల ప్రకారం.. యూఏఈకి చెందిన రస్ ఆల్ ఖైమా(రాకియా) ఏపీలో వాడరేవు, నిజాంపట్నం పోర్టులను అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. వైయస్ హయాంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు నిమ్మగడ్డ కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేలా రాకియా ఒప్పందం కుదుర్చకుంది. ఇందుకోసం రాకియా మారిషస్‌లో 2008లో రాక్ విజన్ లిమిటెడ్, రాక్ ఇన్ ఫ్రా హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీలను స్థాపించింది. వీటికి రూ.714 కోట్లకు పైగా బదలాయించిందని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

ఆ రెండు సంస్థల ద్వారా పెట్టుబడులు
ఆ రెండు సంస్థల ద్వారా నిమ్మగడ్డ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత రాక్ ఇన్ ఫ్రాకు చెందిన 462 కోట్లకు పైమొత్తం షేర్లను వాన్ పిక్ పోర్ట్స్‌కు బదలాయించారు. ఆ తర్వాత నిమ్మగడ్డకు చెందిన మూడు కంపెనీలకు షేర్లు బదలీ అయ్యాయి.

నిమ్మగడ్డ అరెస్టయ్యాక
ప్రసాద్ అరెస్టయిన కొన్ని నెలల తర్వాత 2013 ఆగస్టులో మారిషస్ ఆర్థిక సేవల కమిషన్ నుంచి అప్లెబీ సంస్థకు ఓ లేఖ వచ్చింది. మారిషస్ కంపెనీల నుంచి భారత్‌కు డబ్బు ప్రవహించిన తీరు అందులో ఉంది. ప్రవాస భారతీయునిగా 2007-08 మధ్య మారిషస్‌లో తాను వేర్వేరు కంపెనీలను నెలకొల్పాననీ, అవి ఇప్పటికీ ఉన్నాయని నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. 2008లో ఆర్థిక మాంద్యం వల్ల వాన్‌పిక్ ప్రాజెక్టుకు పెట్టుబడిదారుల్ని తీసుకురాలేకపోయానని చెప్పారు. ఎఫ్‌ఎస్‌సీ అడిగిన సందేహాలకూ తాము సమాధానాలిచ్చామన్నారు. సీబీఐ కేసు కోర్టులో ఉన్నందున దానిపై వ్యాఖ్య చేయబోనని చెప్పారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications