మీ ప్రభుత్వానికి ''శతకోటి దండాలు!!'' .. మాకు 'అమ్మ ఒడి' వద్దు.. ఏమొద్దు??
''మాకు 'అమ్మ ఒడి' వద్దు.. 'చేయూతా' వద్దు.. అసలు ఈ ప్రభుత్వమే వద్దు.. దయచేసి ప్రాథమిక పాఠశాలలను తీసేయకండి.. ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే.. అంతదూరం చిన్నపిల్లలు వెలా వెళతారు? మా పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ'' శ్రీకాకుళం జిల్లా పలాస ఉదయపురంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలకు అంతదూరం చిన్నపిల్లలు వెళితే దారిలో వారినెవరైనా కిడ్నాప్ చేస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులంతా చేతులెత్తి మొక్కుతూ ప్రాథమిక పాఠశాలలను తీసేయొద్దని వేడుకున్నారు. మీ ప్రభుత్వానికి శతకోటి దండాలు.. మా పాఠశాలలు మార్చొద్దు.. మమ్మల్ని హింసపెట్టే ప్రభుత్వం మాకొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

#KamsaMamaJagan నాడు - నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉందో చూడండి. పాడేరు మండలం, సలుగు పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.(1/2) pic.twitter.com/g1QKeRuvan
— Lokesh Nara (@naralokesh) July 7, 2022
ఉదయపురంలోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చిన్న పిల్లలను చూపిస్తూ.. ''వీళ్లకు ఏమైనా లోకజ్ఞానం తెలుస్తుందా? ఎవరిని అడిగి పాఠశాలలను విలీనం చేస్తున్నారు? వీరికి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారంటూ'' ప్రశ్నించారు. పాఠశాలలను మార్చొద్దంటూ తల్లిదండ్రులు చేసే పోరాటానికి ఉపాధ్యాయులంతా సంఘీభావం తెలపాలని కోరారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల వీడియోలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications