మళ్లీ ఇలా జరిగితే, కథలు చెప్పకండి: పరిటాల సునీత హెచ్చరిక
పలుమార్లు చెప్పినా మార్పు రావడం లేదని, ఇంకా అనేకచోట్ల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మంత్రి పరిటాల సునీత సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం: పలుమార్లు చెప్పినా మార్పు రావడం లేదని, ఇంకా అనేకచోట్ల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మంత్రి పరిటాల సునీత సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్న సైజు కోడిగుడ్లు ఇవ్వడం, దుర్వాసన వచ్చే పాలు పంపిణీ చేయడం, నాసిరకం కూరగాయలు, ఆకు కూరలతో వంట.. ఇలా పొరపాట్లు జరుగుతున్నాయన్నారు.
మంగళవారం డ్వామా కార్యాలయంలో ఐసీడీఎస్ సీడీపీఓ, అదనపు సీడీపీఓల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో అమలయ్యే అన్ని రకాల పథకాలపై సమీక్షించారు.

ఆఫీసులో ఉంటే పనికాదని హెచ్చరిక
ఇప్పటి వరకు జరుగుతున్న పొరపాట్లకు స్వస్తి పలకాల్సిందే అన్నారు. ఇఖ నుంచి ఎలాంటి తేడా వచ్చినా సీడీపీఓలనే అడుగుతామని, పౌష్టికాహారం అందించాలని హితవు పలికారు. అధికారులంతా నిర్లక్ష్యం వీడాలని, కార్యాలయాలకు పరిమితమైతే సమస్యలు పరిష్కారం కావని హెచ్చరించారు.

అన్నీ ఇచ్చినా
ప్రాజెక్టులోని వివిధ రకాల సమస్యలు పరిష్కారం చేశామని, కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు ఇప్పించామని, అంగన్వాడీ కేంద్రాల అద్దెలు చెల్లించామని, ఇతర బిల్లులు ఇచ్చామని, అయినా సీడీపీఓ, పర్యవేక్షకుల్లో పనితీరు మారలేదన్నారు. రాష్ట్రంలోనే జిల్లా ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల మాదాపురం అంగన్వాడికి వెళ్తే పిల్లలు లేరని, ఆరా తీస్తే ఆరు నెలలుగా టీచరు సెలవులో ఉన్నారన్నారు.

కథలు చెప్పొద్దని హెచ్చరిక
కథలు చెబితే ఎలాగని, సక్రమంగా పని చేయాలని సునీత సూచించారు. సమస్యలేమయినా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.

నాణ్యమైనదే అందించండి
అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం, పప్పులు, నూనె అందించాలని పౌరస రఫరాల అధికారులను మంత్రి అదేశించారు. ఎక్కడైనా పాలలో నాణ్యత లోపిస్తే తక్షణమే 9440778111నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యను పరిష్కారించుకోవాలన్నారు. గృహహింసకు గురైన మహిళలకు సఖి సెంటర్ సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications