Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

parvatipuram assembly politics: పార్వతీపురంపై పెత్తనం వారిదేనా!!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏపీలోని పార్వతీపురం నియోజకవర్గంలో అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన, బిజెపిల ఉమ్మడి అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర కు అవకాశం కల్పించగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ఇక పార్వతీపురం నియోజకవర్గం విషయానికి వస్తే పార్వతిపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ తర్వాత 2007- 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం నియోజకవర్గ స్వరూపంలో మార్పు వచ్చింది. ప్రధానంగా అక్కడ వ్యవసాయం పైనే ప్రజల జీవితం కొనసాగుతుంది. ఈ నియోజకవర్గ ఓటర్ల విషయానికి వస్తే ఒక లక్ష 93 వేల, 314 మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు.

parvatipuram assembly politics who is going to win in Parvatipuram

వారిలో పురుష ఓటర్లు 94 వేల 236 మంది కాగా, మహిళా ఓటర్లు 99, 039 మంది. ఎస్సీ నియోజకవర్గం అయిన పార్వతీపురం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలలో పట్టు కోసం అన్ని రాజకీయ పార్టీలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్న అలజంగి జోగారావు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2014లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ హోదాలలో పనిచేశారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులుపై 24 వేల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ప్రస్తుతం అదే నియోజకవర్గం నుండి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. జగన్ సర్కార్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన బలంగా నమ్ముతూ, ఇంటింటికి తిరిగి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈసారి ఎలాగైనా గెలవాలని దృఢ సంకల్పంతో ఉన్న టిడిపి బిజెపి జెఎస్పీ కూటమి నుండి బరిలోకి దిగుతున్న బోనాల విజయ్ చంద్ర ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వివరిస్తున్నారు.

ప్రతీ చోట విజయమే లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారాన్ని కొనసాగిస్తుంది . ఇక పార్వతీపురంలో హోరాహోరీగా అప్పుడే ప్రచారం కొనసాగిస్తున్న ఈ నేతలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+