TTD: తిరుమలలో ఒక్క రోజులోనే అనూహ్యంగా, భక్తులకు బిగ్ అలర్ట్...!!
Tirumala: తిరుమలలో సంక్రాంతి వేళ ప్రత్యేక శోభ సంతరించుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భోగి రోజు సాధారణంగా కనిపించిన భక్తుల సంఖ్య.. ఒక్క రోజులోనే అనూహ్యంగా పెరిగింది. ఇక.. శ్రీవారి పార్వేట ఉత్సవం ఈనెల 16న కనుమ రోజు వైభవంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. దీంతో.. ఆ రోజున ఆర్జిత సేవలను రద్దు చేసారు. ఇక.. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమలలో సంక్రాంతి సెలవుల వేళ రద్దీ పెరిగింది. భోగి రోజున తిరుమలలో రద్దీ సాధారణంగా కనిపించింది. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకున్నారు. అయితే, సంక్రాంతి సమయానికి మాత్రం రద్దీ గణనీయంగా పెరిగింది. తిరుమలలో అన్ని కంపార్ట్ మెంట్లు నిండి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనం సుమారు 14 నుండి 16 గంటలు సమయం తీసుకుంటోంది. కాగా, బుధవారం తిరుమలలో 76,289 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 27,586 మంది తలనీలాలు సమర్పించారు. ఒక్క రోజులో వచ్చిన హుండీ ఆదాయం రూ 3.84 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక.. శ్రీవారి పార్వేట ఉత్సవం ఈనెల 16న కనుమ రోజు వైభవంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు.

16వ తేదీన ఉదయం 5.30 నుంచి 6.30 గంటల మధ్య ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్దజీయర్ మఠం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మలయప్ప, శ్రీకృష్ణ స్వామివార్లు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఆస్థానం, పార్వేట పూర్తయ్యాక స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. దీంతో పాటుగా ఈ నె ల 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. పండుగ సెలవులు ముగుస్తున్న వేళ తిరుమలలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications