కెసిఆర్‌పై ప్రజలే తిరగబడుతారు: ప్రత్తిపాటి, జగన్‌పైనా

Pathipati Pulla Rao opposes KCR attitude
గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆ రాష్ట్ర ప్రజలే తిరగబడుతారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉన్న నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం తిరిగి విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టడం దారుణమన్నారు.

రెండు రాష్ట్రాలకు సమస్య వచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాల్సి ఉండగా కేసీఆర్‌ దుందుడుకు వైఖరితో ఉంటూ ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ వైఖరిని తెలంగాణ ప్రజలు కూడా వ్యతిరేకించే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తామే తప్ప వారినుంచి బలవంతంగా తీసుకోవడం జరగదన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ తన పార్టీ ఉనికిని రాష్ట్రంలో కాపాడుకునేందుకే ధర్నాలు, దీక్షలు అంటూ హడావిడి చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వేరే పార్టీలోకి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.

తమ టిడిపి ప్రభుత్వంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను చూసి ప్రజలు తమను ఎక్కడ మర్చిపోతారేమోనని ఆందోళనలో, దిక్కు తోచని స్థితిలో జగన్‌ పార్టీ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ధర్నాలంటున్నారంటూ మంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణదినోత్సవం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి వైసీపీ ఆధ్వర్యంలో నవంబర్‌ 1న చేసిన ఉత్సవాన్ని ప్రజలు కూడా ఆదరించలేదన్నారు. దోచుకున్న డబ్బులను దాచుకోవడం కోసమే అధికారం అన్నట్లుగా జగన్‌ తీరు ఉందని, దీనిని ప్రజలందరూ అర్ధం చేసుకున్నారన్నారు.

రాష్ట్రంలో సీసీఐ అధికారులు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన క్వింటా రూ.4,050 కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత సీసీఐపై ఉం దన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో గురువారం సమీక్షిస్తున్నట్లు మంత్రి పుల్లారావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+