హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హృదయంపై కణితి తొలగింపు, ఆరోగ్యంగా.. (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు అరుదైన శైశవ గ్రంథి భారీ బినైన్ ట్యూమర్ శస్త్ర చికిత్స చేశారు. ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టంట్ కార్డియోథొరాసిన్ సర్జన్ డాక్టర్ వెంగళ్ రెడ్డి, డాక్టర్లు రఘు, సర్ధార్ హుస్సేన్, కిరణ్ కుమార్‌లు ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రాయలసీమకు చెందిన 25ఏళ్ల యువకుడు సద్దాంహుస్సేన్ శరీరంలో భారీ పరిమాణంలో పెరిగిన 2.8 కిలోల శైశవగ్రంథి కణతిని ఆగస్టు 28న అత్యవసర శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు.

ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ యువకుడి బాధను దూరం చేశారు. మనదేశంలో మొట్టమొదటి సారిగా జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను డాక్టర్లు రఘు, వెంగళ్ రెడ్డి, కిరణ్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. రాయలసీమకు చెందిన సద్దాంహుస్సేన్(25)కు నాలుగు అడుగులు వేస్తే ఆయాసం, గుండెలో నొప్పి, పొడి దగ్గు వచ్చేది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్యులెందరికో చూపించుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ ఇబ్బంది కారణంగా కువైట్‌లో వచ్చిన ఓ ఉద్యాగాన్ని కూడా వదులుకున్నాడు.

చివరకు సద్దాంహుస్సేన్ ప్రైమ్ వైద్యులను కలిశారు. అతడికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయగా భారీ కణితి గుండెవద్ద ఉన్నట్లు గుర్తించారు. అది థైమోలెఫోమాగా నిర్ధారించారు. ఈ కణితి గుండెపై అధిక శాతం ఆక్రమించిందని ఆయన తెలిపారు. ఇది ఛాతిపై రెండువైపులా గుండె, ఊపిరితిత్తులకు ఆనుకొని ఉందని డాక్టర్ వెంగళ్ రెడ్డి తెలిపారు. రోగి అంగీకారంతో ఆగస్టు 28న శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు అతడు కొలుకుంటున్నట్లు ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు వివరించారు.

తొలగిచిన కణితి

తొలగిచిన కణితి

నగరంలోని ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు అరుదైన శైశవ గ్రంథి భారీ బినైన్ ట్యూమర్ శస్త్ర చికిత్స చేశారు.

వైద్యులు

వైద్యులు

ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టంట్ కార్డియోథొరాసిన్ సర్జన్ డాక్టర్ వెంగళ్ రెడ్డి, డాక్టర్లు రఘు, సర్ధార్ హుస్సేన్, కిరణ్ కుమార్‌లు ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

బాధితుడు

బాధితుడు

రాయలసీమకు చెందిన 25ఏళ్ల యువకుడు సద్దాంహుస్సేన్ శరీరంలో భారీ పరిమాణంలో పెరిగిన 2.8 కిలోల శైశవగ్రంథి కణతిని ఆగస్టు 28న అత్యవసర శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు.

వైద్యులతో బాధితుడు

వైద్యులతో బాధితుడు

ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ యువకుడి బాధను దూరం చేశారు. మనదేశంలో మొట్టమొదటి సారిగా జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను డాక్టర్లు రఘు, వెంగళ్ రెడ్డి, కిరణ్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు.

వైద్యలు

వైద్యలు

రాయలసీమకు చెందిన సద్దాంహుస్సేన్(25)కు నాలుగు అడుగులు వేస్తే ఆయాసం, గుండెలో నొప్పి, పొడి దగ్గు వచ్చేది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్యులెందరికో చూపించుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు.

స్కానింగ్‌లో కణితి

స్కానింగ్‌లో కణితి

ఈ ఇబ్బంది కారణంగా కువైట్‌లో వచ్చిన ఓ ఉద్యాగాన్ని కూడా వదులుకున్నాడు. చివరకు సద్దాంహుస్సేన్ ప్రైమ్ వైద్యులను కలిశారు. అతడికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయగా భారీ కణితి గుండెవద్ద ఉన్నట్లు గుర్తించారు.

English summary
Prime Hospital specialists treat a rare case of a massive benign tumour of the thymus gland! A team of doctors Dr S. Vengal Reddy, Consultant Cardiothoracic Surgeon, Dr.Sartaz Hussain and Dr.Kiran kumar (Anesthesiologist) Prime Hospitals, performed a critical surgery to relieve a twenty fiveyear old man Saddam Hussain from Rayalaseema with 2.8 kg massive tumor of the Thymus gland, on August 28, 2014
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X