కాపాడుకుంటే చాలు: జగన్‌పై మంత్రి పుల్లారావు

ఎన్నికలు జరిగి 40 రోజులైందన్నారు. పంట రుణాల మాఫీకి తమ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల మానిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రుణాల మాఫీపై 420 కేసు పెట్టాలని జగన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జైలుకెళ్లి వచ్చిన జగన్‌పై అనేక చీటింగ్ కే సులు ఉన్నట్లు గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ పార్టీలు పదేళ్లు పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చారని, తమ పార్టీనేత చంద్రబాబు పదేళ్లపాటు పోరాటం చేయడం వల్లనే ప్రజలు గుర్తించారని, ఐదేళ్లకు ఒక సారి ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని జగన్ గుర్తించాలని ఆయన అన్నారు. రుణాల మాఫీ అమలు కావడం జగన్‌కు ఇష్టం లేదన్నారు.
రాష్ర్టాభివృద్ధికి సహకరించకుండా ఢిల్లీలో కేంద్రమంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక గౌరవం కల్పించి ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమాలకు ఆహ్వానిస్తే ఆయన ముఖం చాటేశారని అన్నారు. రాష్ర్టాభివృద్ధిపై ఎంపీల సమావేశం ఏర్పాటు చేస్తే వైసీపీ సభ్యులు హాజరు కాలేదన్నారు.
లోక్‌సభ స్పీకర్ పాల్గొన్న ఈ కార్యక్రమాలను జగన్ నిర్లక్ష్యం చేయడం ఆయన పనితీరుకు అద్దం పడుతోందన్నారు. రుణాల మాపీపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. చంద్రబాబు వద్ద అక్షయపాత్ర, మంత్రదండం లేదన్నారు. సమైక్యాంధ్రను పదేళ్లపాటు అభివృద్ధి చేసిన చంద్రబాబు 13 జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్‌ను తీర్చి దిద్దుతారని మంత్రి పుల్లారావు స్పష్టంచేశారు.
2019లో కూడా మాదే అధికారం తమదేనని, రాష్ట్రంలో 2019లో కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మంత్రి పుల్లారావు జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెరమరుగవుతాయన్నారు. రుణాల మాఫీపై చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టినట్లు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి పుల్లారావు ఖండించారు.
కాంగ్రెస్ నేతల ప్రకటనలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. గుంటూరులో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరైందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పుల్లారావు తెలిపారు.












Click it and Unblock the Notifications