ప‌వ‌న్ మా భ‌రోసా..! పాగా వేస్తాం..!!

అదఃపాతాళం నుండి ఆకాశానికి ఎద‌గ‌డం అంటే ఇదే.! ద‌శాబ్దాల త‌ర‌బ‌డి నామ‌మాత్రంగా ఉన్న పార్టీ ఇప్పుడు ముఖ్య‌మంత్రి స్థాయి అభ్య‌ర్థి త‌మ‌కు కూడా ఉన్నాడ‌ని భ‌రోసా వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయ‌పార్టీల ద్రుష్టిని ఆక‌ర్శిస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను కూడా నిల‌బెట్ట‌లేని ఆ పార్టీ ఏకంగా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఉన్నాడ‌ని, ఎన్నిక‌ల్లో కాసుకోండ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు స‌వాల్ విసురుతోంది. ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాలు ఆ పార్టీకి వ‌రంగా ప‌రిణ‌మించింది. ఇంత‌కీ ఏపీలో తొడ‌గొడుతూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను క‌వ్విస్తున్న ఆ పార్టీ క‌థాక‌మామిషు ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క్యాడ‌ర్లో భ‌రోసా నింపుతాయ‌న‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణే ఉదాహ‌ర‌ణ‌..!

నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క్యాడ‌ర్లో భ‌రోసా నింపుతాయ‌న‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణే ఉదాహ‌ర‌ణ‌..!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో జరగబోయేది ద్విముఖ పోరు కాదని, తాముకూడా బరిలో ఉన్నామని వామపక్షాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నిక్లలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉండదని, తాము కూడా గట్టి పోటీనిస్తామని వారు అంటున్నారు. జనసేనతో పొత్తు కుదిరినప్పటి నుంచి వీరి వైఖరిలో మార్పు కనిపిస్తోందని తెలుస్తోంది. గతంలో రాష్ట్ర విభజన జరిగాక కమ్యూనిస్టులు మరింత బలహీన పడ్డారనే వార్తలు అప్పట్లో షికారు చేసాయి. అయితే జనసేనతో పొత్తు కుదిరాక వామపక్షాలు పోటీలో తాము ఉండటంతోపాటు తమకు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఉన్నాడని ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

ఏపీలో ప‌వ‌న్ అండ‌దండ‌ల‌తో ద్యైర్యంగా ముంద‌డుగు వేస్తున్న వామ‌ప‌క్షాలు..

ఏపీలో ప‌వ‌న్ అండ‌దండ‌ల‌తో ద్యైర్యంగా ముంద‌డుగు వేస్తున్న వామ‌ప‌క్షాలు..

ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనే మాటను వామ‌ప‌క్ష‌లు నిరంతరం జపిస్తున్ననట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, ఈ కూటమిలో ఎవరికి ఎక్కువ సీట్లు దక్కితే వారే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణ‌యిస్తార‌ని కమ్యూనిస్టు పార్టీ నేతలు ప్రకటించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో లెఫ్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎం లకు ఓటు బ్యాంకు ఎంత ఉందో అందరికీ విదితమే. అయితే ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడైనా డిపాజిట్ సాధించగలిగే నియోజకవర్గం ఏదైనా ఉందా? ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అంటున్న రామకృష్ణ ఎక్కడ పోటీచేసి నెగ్గబోతున్నాడు? అనే దానికి ఆ పార్టీలోని వారెవరూ సమాధానం చెప్పలేకపోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీల‌యాల్లో త‌ల‌ప‌డ‌క‌పోయినా భ‌రోసా వ్య‌క్తం చేస్తున్న ఎర్ర‌సైన్యం..

ప్ర‌త్య‌క్ష రాజ‌కీల‌యాల్లో త‌ల‌ప‌డ‌క‌పోయినా భ‌రోసా వ్య‌క్తం చేస్తున్న ఎర్ర‌సైన్యం..

ముక్కోణపు పోటీ అంటున్న వీరు తమ నేత మధు ఏ నియోజకవర్గంలో అయినా నామినేషన్ వేస్తారా? అనే ప్రశ్నలకు వారి దగ్గరే సమాధానం మాత్రం క‌నిపించ‌డం లేదు. ఎటొచ్చీ వీరి ఆశలన్నీ పవన్ కల్యాణ్ మీదే ఉన్నాయి. పవన్ కల్యాణ్‌తో తాము కలిసి పోటీ చేయబోతున్నామని మూడో కూటమి తమదేనని చెబుతున్నారు. తాము టీడీపీ, వైఎస్సార్సీపీలకు గట్టి పోటీ ఇస్తామని వీరు కనిపించినవారికల్లా చెబుతున్నారట.
కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఒక సమావేశంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతామని వామపక్షాల నేతలు, జనసేన ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇది ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందనే దానిపై పలు అనుమానాలు నెలకొన్నన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చివ‌రి వ‌ర‌కూ ప‌వ‌న్ తో ఉండేదెవ‌రు అనే అంశం పై ఉత్కంఠ‌..!

చివ‌రి వ‌ర‌కూ ప‌వ‌న్ తో ఉండేదెవ‌రు అనే అంశం పై ఉత్కంఠ‌..!

ఇంత వరకు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వెంట నడిచిన వామపక్ష పార్టీలు ఇప్పుడు సీపీఐ - సీపీఎంలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి పవన్ వైఖరి నచ్చకపోవడం ఒక కారణం కాగా జగన్ లోని కట్టుబాటు వారిని ఆ పార్టీవైపు చూసేలా చేస్తోందట. ఈ నేపధ్యంలో వామపక్ష పార్టీల్లో కొంతమంది పవన్ వెంట వెళ్లాలని భావిస్తుండగా, మరికొంతమంది జగన్ వైపే వెళ్లాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు పవన్ పార్టీలో నియోజక వర్గ పరిశీలకుల నియామకాలు, పార్టీలోని కీలక పదవులను ఒకే కులానికి చెందిన వారికే ఇవ్వడం వామపక్ష నాయకులకు రుచించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీల్లో వైఖరులు మారుతున్నట్లే వామపక్షాల్లోనూ కనిపించ‌డం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+