పవన్ కు అమిత్ షా దిశా నిర్దేశం - టీడీపీపై బీజేపీ మూడ్ క్లియర్..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేనాని పవన్ సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల గురించి వీరిద్దరి మధ్య జరిగింది. పొత్తుల సమయంలో టీడీపీ ప్రస్తావన లేదు. తెలంగాణలో కలిసి పని చేయాలని పవన్ కు షా సూచించారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు. అదే సమయంలో టీడీపీ ప్రస్తావన..ఏపీలో పొత్తుల గురించి షాతో చర్చల సమయంలో స్పష్టమైన సంకేతాలతో బీజేపీ మూడ్ ఏంటనేది క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.

సీట్ల సర్దుబాటు:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చించారు. తెలంగాణలో తమకు 33 సీట్లు ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఇప్పటికే 32 సీట్లకు సంబంధించి ప్రకటన చేసిన అంశాన్ని పవన్ ఈ సమావేశంలో వివరించారు. అయితే, బీజేపీ మాత్రం మూడు నుంచి ఆరు సీట్ల వరకు మాత్రమే జనసేకు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జనసేనకు 20 సీట్లు ఇవ్వాలని షా ను పవన్ కోరినట్లు తెలిసింది. అయితే, ఖమ్మం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు బీజేపీ నాయకత్వం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తి చేసినట్లు సమాచారం. దీంతో, ఈ సమావేశంలో తుది నిర్ణయం జరగలేదు. ఈ నెల 27న అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఆ సమయంలోగా సీట్లు గురించి రెండు వైపుల నుంచి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని షా నిర్దేశించారు.

Pawan Kalayn met Union Home Minister Amith Shah and disucssed on Telangana Poll Alliance

పవన్ కు క్లారిటీ:అమిత్ షా తో భేటీ సమయంలో పవన్ ఏపీ అంశాలను ప్రస్తావించారు. ఏపీకి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని..రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, టీడీపీతో పొత్తు ప్రకటన వెనుక కారణాలను బీజేపీ ముఖ్యులకు వివరిస్తామని పవన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఈ భేటీలో టీడీపీ ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. కేవలం తెలంగాణలో కలిసి పని చేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీజేపీ..జనసేన కలిసి తెలంగాణలో పని చేయటం పైన ఇప్పటికే చర్చలు జరిగాయని..

జాతీయ నాయకత్వంతో చర్చిద్దామని పవన్ ప్రతిపాదించటంతో ఈ సమావేశం ఏర్పాటు అయిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. జనసేన ఒక్కటే ఎన్డీఏ భాగస్వామి..అంతవరకే తమ చర్చలు ఉంటాయని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ ఆలోచన ఏంటనేది దీని ద్వారా స్పష్టం చేసారు.

Pawan Kalayn met Union Home Minister Amith Shah and disucssed on Telangana Poll Alliance

టీడీపీతో పొత్తు లేనట్లే:ఏపీలో జనసేన వైఖరి ఎలా ఉన్నా..తెలంగాణలో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. నవంబర్ 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. దీని ద్వారా తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ సిద్దంగా లేదనేది తేలి పోయింది. అదే సమయంలో జనసేనను వదులుకోవటానికి బీజేప ఇప్పటికిప్పుడు సుముఖంగా లేదు.

పవన్ ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగటం ద్వారా ప్రస్తుత పరిస్థితి జనసేనానికి ఇరకాటంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో, తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ పోటీలో ఉన్నా ఒంటరిగా నే బరిలోకి దిగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక, తెలంగాణలో ఈ పొత్తుల ప్రభావం..ఏపీ ఎన్నికలపైన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+