బాబు డైరెక్షన్‌లో పవన్ నటన: ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంపై శిల్పా చక్రపాణి

కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నంద్యాల పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో సమస్యల గురించి తెలుసుకుని వాటిపై చంద్రబాబును ప్రశ్నించాలని పవన్‌కు సూచించారు. చంద్రబాబు సైతం వైసీపీ మీద విమర్శలు కట్టిపెట్టి ఇచ్చిన హామిలను నెరవేర్చడంపై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.

pawan kalyan acting in chandrababu direction says shilpa chakrapani reddy

ముచ్చుమర్రి ప్రాజెక్టు పైపులు తీసుకెళ్లి పట్టిసీమకు బిగించారని, కనీసం నాలుగు రోజులు కూడా నీళ్లివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హామి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు.

కాగా, నంద్యాల ఉపఎన్నికకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ శిల్పా చక్రపాణి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో చక్రపాణి సోదరుడు, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి పరాజయం పాలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+