ఒకే వేదికపై బాలయ్య, పవన్, జూ ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ - చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!!

ఏపీలో ఎన్నికలకు టీడీపీ సిద్దం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి ఎన్నికలకు పక్కా వ్యూహాత్మకంగా సిద్దమవుతున్నారు. పొత్తులతో పాటుగా ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో నందమూరి కుటుంబం పాత్ర కీలకం కానుంది. ఈ సారి రాజమండ్రి వేదికగా నిర్వహించే మహానాడు వేదిక ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అరుదైన కలయికకు వేదిక కానున్నాయి.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు:ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఈ నెల 20న హైదరాబాద్ లో జరగనున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిర్వహణా కమిటీ నందమూరి కుటుంబంతో పాటుగా పలువురు సినీ ప్రముఖలను ఆహ్వానించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్‌ సమగ్ర సినీ, రాజకీయ జీవితంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన 'శక పురుషుడు' ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన 'జై ఎన్టీఆర్‌' వెబ్‌సైట్‌ ఆవిష్కరిస్తారు.

Pawan Kalyan and Jr NTR likely to share dias with Chandra Babu

ఒకే వేదికపై ప్రముఖులు:ఈ కార్యక్రమానికి ఇప్పటికే నిర్వహణ కమిటీ 'గెస్ట్స్‌ ఆఫ్‌ ఆనర్‌'గా పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ గారు, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా గారు, సీపీఎం జాతీయ శ్రీ సీతారామ్‌ ఏచూరి గారు, దగ్గుబాటి పురందీశ్వరి గారు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ , కన్నడ చిత్ర హీరో శివకుమార్‌ గారు, హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌, ప్రభాస్‌, దగ్గుబాటి వెంకటేష్‌, సుమన్‌, మురళీ మురళీమోహన్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌, జయప్రద, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు, సి. అశ్వనీదత్‌ తో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. వీరు ఎన్టీఆర్ గురించి ప్రసంగించనున్నారు. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది.

ఎన్నికల వేళ ఆసక్తి కరంగా:విజయవాడలో జరిగిన శతజయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ పాల్గొన్నారు. ఆయన ఆ సభలో చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ మండిపడింది. ఆ కార్యక్రమానికి జూ ఎన్టీఆర్ ను ఆహ్వానించకపోవటం పైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జూ ఎన్టీఆర్ పాటుగా రాజకీయంగా పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ జనసేనాని పవన్ ను కూడా ఆహ్వానించారు. అదే విధంగా ప్రభాస్, అల్లు అర్జున్ ను ఆహ్వానించటం ప్రత్యేకత సంతరించుకుంది. ఇంత మంది అగ్రహీరోలు..రాజకీయ ప్రముఖులు ఒకే వేదిక మీదకు రావటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరందరినీ ఆహ్వానించినా.. ఎవరెవరు హాజరు అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయాలకు అతీతంగా జరిగే సభ అయినా.. ఏపీలో ఎన్నికల ముందు జరుగుతన్న కార్యక్రమం కావటంతో రాజకీయంగానూ ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+