పవన్ లెక్క తప్పుతోందా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతోంది. ఈ పదేళ్లలో జనసేన సాధించింది శూన్యమని చెప్పాలి. ప్రశ్నిస్తా అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ తన ప్రశ్నలను కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబు సీఎం కావడంలో తన వంతు పాత్ర పోషించారాయన. ఆ తరువాత టీడీపీతో విభేదించి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన దారుణ ఓటమిని చవి చూసింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఘోర ఓటమిని చవి చూశారు. గడిచిన పదేళ్లలో పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఏనాడు దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. జనసేనకు బుత్ స్థాయి మెంబర్లు లేరని అలాంటప్పుడు మనం మెజార్టీ సీట్లలో ఎలా పోటీ చేస్తామంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా నిలిచాయి.

ఎన్నికల్లో పోటీ చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం అని పవన్ కల్యాణ్‌కు తెలియంది కాదు. ఒకసారి జీరో పాలిటిక్స్ అంటాడు.. మరోసారి నేను ఎప్పుడు జీరో పాలిటిక్స్ గురించి మాట్లాడలేదంటాడు. సొంత క్యాడర్‌పైనే నిందలు వేస్తూ.. మీరు జగన్‌కు ఓటేశాడని విమర్శిస్తాడు. నిత్యం జగన్ మీద తీవ్ర విమర్శలు చేసే పవన్ కల్యాణ్..గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినన్ని స్థానాల్లో కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
తొలుత 23 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్ తరువాత ఆ సంఖ్యను 21కి తగ్గించుకున్నారు. అసలు పవన్ కల్యాణ్ ఎవరి కోసం ఇలా దిగజారిపోతున్నారో పార్టీ క్యాడర్‌కు సైతం అర్థం కావడం లేదు.జగన్ ఓడిపోతే పవన్ కల్యాణ్ సీఎం అవుతారా అంటే అది లేదు. పవన్‌కు సీఎం సీటు షేరింగ్ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ తేల్చి చెప్పారు. అయిన కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు గెలుపు కోసం ఇంతలా ఎందుకు పరితపిస్తున్నారో జనసైనికులకు కూడా అర్థం కావడం లేదు.

అసలు రాష్ట్రంలో చనిపోయిందనుకున్న టీడీపీని బ్రతికించి మనం వారి పల్లకిని మోయాల్సిన అసవరం ఏమోచ్చిందని పార్టీ అధినేతను జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.గతంలో పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన నేతలకే టికెట్లు దక్కని పరిస్థితి. పవన్‌ను జనసేన నాయకులే నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications