పవన్ జన్మదిన వేళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా - చంద్రబాబు, లోకేష్ సహా..దేవుడిచ్చిన అన్న..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినం నేడు. పవన్ అభిమానులు.. జన సైనికులు పండుగ లా ఈ వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రోజున జనసేన యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో పవన్ కు ప్రధాని మోదీ సహా సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు.. ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పవన్ బర్త్ డే విషెడ్ ట్రెండ్ అవుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ జన్మదినం వేళ ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో.." పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల్లో ఎంతో గౌరవం కలిగిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ (NDA) యొక్క సుపరిపాలన అజెండాకు ఊతమివ్వడంలో ముందు వరుసలో ఉన్నారు. సమాజ సేవలో ఆయన దీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను..." అంటూ పేర్కొన్నారు.

ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. అదే విధంగా సీఎం చంద్రబాబు సైతం ట్వీట్ చేసారు. "మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు.. అని పేర్కొన్నారు.
దీనికి కొనసాగింపుగా.." గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను..." అంటూ చంద్రబాబు తన సందేశంలో ఆకాంక్షించారు.
మంత్రి లోకేష్ సైతం ఆసక్తి కర ట్వీట్ చేసారు. "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు...అని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications