పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం, బీజేపీ వాట్ నెక్స్ట్..!!

జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్డీఏ భాగస్వామి గా ఉన్న పవన్.. తెలంగాణలో కొత్త రాజకీయం మొదలు పెట్టారు. బీజేపీ తమకు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని.. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. దీంతో.. గతం లో ప్రకటించిన విధంగా జనసేన రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ మేరకు మిగిలిన పార్టీల కంటే ముందే తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. దీంతో.. ఇప్పుడు పవన్ నిర్ణయంతో బీజేపీ పైన ఒత్తిడి పెరుగుతోంది. తదుపరి నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

తెలంగాణ కేంద్రంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీ చేసి తీరుతామని గతంలోనే పవన్ ప్రకటించారు. బీజేపీ కలిసి వచ్చినా.. రాకున్న తాము పోటీలోనే ఉంటామని స్పష్టం చేసారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావును జనసేన పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్‌ గడల గతంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేశారు. డాక్టర్‌ గడల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్రతిపాదనకు పవన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్‌ మల్లన్న పదవీ కాలం త్వరలోనే ముగియనడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!
కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!
janasena-chief-pawan-finalized-gadala-srinivasa-rao-party-candidate-for-garudate-mlc-election-in-tel

ముందుగా అభ్యర్ది ఖరారు తో

కాగా, 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాము అధ్యక్ష తన ఖమ్మంలో ఆదివారం జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపైఈ సమావేశంలో చర్చించారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాస్‌ పేరును పార్టీ ఖరారు చేసిందని, మరో పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి పేరును వారం రోజుల్లో ప్రకటిస్తామని రాము చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. సెప్టెంబరు 13న జనసేన పార్టీ అధ్యర్యంలో జనసేన శంఖారావం నిర్వహించనున్నామని తెలిపారు. ఇప్పుడు మిగిలిన పార్టీల కంటే ముందు గానే జనసేన తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. దీని ద్వారా పరోక్షంగా మిగిలిన పార్టీల పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తోంది. ఇదే విధంగా రానున్న రోజుల్లో పవన్ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+