జగన్ కు నాగబాబు ఘాటు కౌంటర్-ఏది మ్యాన్ మేడ్ డిజాస్టర్?

ఏపీలోని విజయవాడలో వచ్చిన భారీ వరదలు లక్షలాది మందిని ముంచెత్తాయి. ఓవైపు వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే సమయంలో వరదలకు కారణాన్ని ప్రస్తావిస్తూ విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సింగ్ నగర్ లో పర్యటించారు. అనంతరం ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు. అసలు మానవ తప్పిదం ఏదో తెలుసా అంటూ ఓ పెద్ద ట్వీట్ పెట్టారు.

నాగబాబు తన ట్వీట్ లో విజయవాడ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ (మానవ తప్పిదం) అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు కృష్ణానది వరదల విజిట్ కి వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు. ఒకసారి క్రింద పేర్కొన్నది చదవండి అంటూ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో ఈ ఘటన వల్ల 15 మంది గల్లంతుకావడం, ఊర్లు నేలమట్టం కావడాన్ని నాగబాబు ప్రస్తావించారు.

pawan kalyan s brother nagababu trolling ys jagan over man made disaster remark on ap government

విజయవాడ వరదల్ని మానవ తప్పిదం అనరని, అప్పట్లో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకోవడం అసలైన మానవ తప్పిదమని నాగబాబు తేల్చేశారు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్ ఈ రెండింటికీ తేడా తెలుసుకోవాలని నాగబాబు చురకలు అంటించారు. చివర్లో వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది, విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుందంటూ సలహాలు కూడా ఇచ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+