పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం.. బంపర్ మెజార్టీ..1 లక్షకు 5లక్షలు.. బెట్టింగుల ఆడియో లీక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? వంగా గీత పైన విజయం సాధిస్తాడా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఇక నేడు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ విజయం పైన ఎలాంటి అంచనాలను నివేదిస్తాయి? వంటి అనేక అంశాలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ మెజార్టీ పైనే చర్చ
అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని, రాష్ట్రంలోని అందరికంటే ఎక్కువ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన లక్షకు ఐదు లక్షలు అంటూ బెట్టింగులు కడుతున్నారని ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Pawan Kalyan bumper majority than ys jagan and chandrababu shocking Betting audio leaked

పవన్ పోటీతో పిఠాపురం కు పెరిగిన క్రేజ్
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. లోకల్, నేషనల్ మీడియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తయితే, పిఠాపురం నియోజకవర్గం లోని ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అన్నట్టుగా చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారని టిడిపి కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

పవన్ కు రాష్ట్రంలోనే టాప్ మెజార్టీ
జనసైనికులు అయితే భారీ మెజార్టీతో గెలుస్తాడని చెబుతున్న పరిస్థితి ఉంది .అయితే ఏపీలో రాష్ట్రంలో అందరికంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మెజారిటీ వస్తుందని బెట్టింగ్ రాయుళ్ళు బెట్టింగులు కడుతున్నారు. ఇక ఈ విషయం తాజాగా ఒక ఆడియోతో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే, చంద్రబాబు, లోకేష్ కంటే కూడా పవన్ బంపర్ మెజారిటీతో బెట్టింగ్ రాయుళ్లు పందానికి దిగుతున్నారు.

పిఠాపురంలో పవన్ మెజార్టీపై లక్షకు ఐదు లక్షలు .. బెట్టింగులు
భారీ మెజారిటీ వస్తుందని లక్ష రూపాయలు, రాకపోతే ఐదు లక్షలు ఇస్తాం అంటూ జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగ్ నిర్వాహకులు సోషల్ మీడియా, మరియు whatsapp గ్రూప్ ల ద్వారా పిఠాపురం నియోజకవర్గంపై భారీగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైరల్ అవుతున్న ఆడియోలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడు, ఓ కస్టమర్ మాట్లాడుకున్నటువంటి అంశం, అందులో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన కడుతున్న పందాల అంశం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్
ప్రస్తుతం క్లిప్పింగ్ ను ఓ ఛానల్ ప్రసారం చేయడంతో ఈ ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని కస్టమర్ లక్ష పందెం పెట్టాలని, ఒకవేళ అలా రాకపోతే మేమే ఐదు లక్షలు కస్టమర్ కు చెల్లిస్తామని బెట్టింగ్ నిర్వాహకుడు చెబుతున్న ఆడియోను ఇప్పుడు జనసైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తాడు అని బలంగా నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+