Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దాసరితో పవన్ కళ్యాణ్ సినిమా: రాజకీయ కోణం ఉందా?

హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుతో సినిమా చేయాలనే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది. దాసరి నారాయణ రావు ఎన్టీ రామారావుతో బెబ్బులిపులి సినిమా ఆ దిశగా పనిచేసింది. ఎన్టీ రామారావుకు ఆ సినిమా బ్రేక్ ఇవ్వడమే కాకుండా ఆయనకు రాజకీయంగా అది ఎంతో ఉపయోగపడింది. ఈ దృష్ట్యా దాసరి నారాయణరావు తన సొంత తారక ప్రభు ఫిలింస్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై విన్నపం రూపంలో పవన్ కళ్యాణ్ హెచ్చరిక లాంటిది చేశారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రకటన చేయడం దాసరి నారాయణ రావు నుంచి ఆయనతో సినిమా తీసే విషయాన్ని ప్రకటన రావడం ఒకేసారి జరిగాయి. ఈ రెండింటికి మధ్య సంబంధం ఏమైనా ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో కొంత కాలం దాసరి నారాయణ రావు మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గం నుంచి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తనను తప్పించడం పట్ల ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాజకీయాల పట్ల వైరాగ్యం వచ్చినట్లుగా ఒకటి రెండు సార్లు మాట్లాడారు కూడా. తన హయాంలో బొగ్గు నిక్షేపాల కేటాయింపుల వ్యవహారంలో కూడా ఆయన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Pawan Kalyan and dasari combination: political angle

ఈ పరిస్థితిలో దాసరి నారాయణ రావు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రాజకీయంగా ఓ మలుపు తీసుకుంటుందా అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీని బిజెపి నిలబెట్టుకుంటుందనే విశ్వాసం ఉందని అంటూనే దాన్ని కల్పించాల్సిన సమయం వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బిజెపి ఎదుర్కుంటున్న ఇబ్బందులు తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా అనడం చర్చకు దారి తీస్తోంది. ఎపికి ప్రత్యేక హోదా కల్పించడాన్ని తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నారు.

అంతే కాకుండా, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా సూచన వంటి హెచ్చరిక చేశారని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంపైనే కాకుండా రైతుల విషయంపై కూడా ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. కొత్త రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు హెచ్చరికలాంటిదేనని అంటున్నారు.

"కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వం పైన వుంది. రైతు కన్నీరు పెట్టకుండ చూడలిసిన బాధ్యత వుంది లేదంటె వారి ఆగ్రహానికి గురి కావలిసి వస్థుంది. ఎంతో నమ్మకంతో ప్రజలు టీడిపి - బీజేపి కూటమి ని గెలిపించారు, వారి చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఎపి రాజధానికి చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ జరుపుతున్న తీరుపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తుతోంది. ఢిల్లీలో అన్నా హజారే కేంద్ర ప్రభుత్వ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కూడా కొంత మంది దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+