వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ప్రజల్లోకి జనసేనాని - ముహూర్తం ప్రకటన : టార్గెట్ ఫిక్స్..!!

|
Google Oneindia TeluguNews

రానున్న ఎన్నికల కోసం జనసేనాని ముందుగానే కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు జరిగినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటుకే పరిమితం అయింది. దీంతో..ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వాలనేది జనసేనాని లక్ష్యం. ఇందుకోసం ఇప్పటి నుంచే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ పరోక్షంగా పొత్తులకు సంకేతాలిస్తున్నారు. టీడీపీ సైతం పొత్తుకు సిద్దమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పర్యటన

రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పర్యటన

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగానే ప్రజల మధ్యకు వెళ్లి.. ఎన్నికల సమయానికి రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. అక్టోబర్ 5వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

గతంలోనే దీని పైన నిర్ణయం తీసుకున్నా... ఆ తరువాత అనేక దశల్లో ఈ యాత్ర నిర్వహణ పైన చర్చలు చేసారు. ఇప్పుడే యాత్ర ప్రారంభిస్తే ఎన్నికల సమయం వరకు ఎలా కొనసాగించాలనే అంశం పైన చర్చలు చేసారు. అయితే, అన్ని రకాలుగా ఆలోచన చేసిన తరువాత రాష్ట్రా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

విజయ దశమి నుంచి ప్రారంభం

విజయ దశమి నుంచి ప్రారంభం


అక్టోబర్ 5 నుంచే యాత్ర ప్రారంభిస్తామని పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు, పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని తెలిపారు. ఐటీ వింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు. ఈరోజు రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అదే సమయంలో పొత్తు విషయంలో నూ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేన... 2014లో టీడీపీతో కూడా కలిసి మూడు పార్టీలు పొత్తుతో ముందుకెళ్లే ఆలోచన పైన అంచనాలు ఉన్నాయి.

Recommended Video

Title : Chandrababu Naidu About పింగళి వెంకయ్య, పివి నరసింహారావు *AndhraPradesh
పొత్తుల పైన క్లారిటీ ఇస్తారా

పొత్తుల పైన క్లారిటీ ఇస్తారా


అయితే, బీజేపీ నిర్ణయం కీలకం కానుంది. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందుకు వస్తుందా రాదా అనేది ఇంకా తేలాల్సిన అంశం. ఇదే సమయంలో.. జనసేన జనంలో బలం పెంచుకోవటం.. ఒంటరిగానే పోటీ చేయగల సత్తా ఉందని నిరూపించేందుకు పవన్ కళ్యాణ్ ఈ యాత్రను సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. దీంతో..పవన్ కళ్యాన్ యాత్ర పైన క్లారిటీ రావటంతో.. జనసైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

English summary
Janasena Chief Pawan Kalyan tour schedule finalised, on October 5th his bus yatra to begin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X