ప్రజల ప్రమేయం లేకుండానే విభజన, హమీలు నెరవేర్చకపోతే తిరుగుబాటు:పవన్ సంచలనం

హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హమీలను పాలకులు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో దేశ సమగ్రతకు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని జనసేన చీఫ్ పవన్ ళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అసహనం వల్ల దేశంలో అశాంతి నెలకొనే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు ఈ పరిణామాలు తిరుగుబాటుకు కూడ దారితీసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇది ఉత్తరాది, దక్షిణాది అనే వివాదానికి కూడ దారితీసే అవకాశం కూడ లేకపోలేదన్నారు.

Recommended Video

    JFC : Pawan Kalyan says Many Are Showing Interest To Work

    జెఎఫ్‌సి తొలి రోజు శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో వపన్ కళ్యాణ్ ఆహ్వనం మేరకు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి టిడిపి, వైసీపీ ప్రతినిధులు రాలేదు.

    రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశంలో ఏపీకి న్యాయం జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రానున్న రోజుల్లో ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు నేతలు ప్రకటించారు.

     ప్రజల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజన

    ప్రజల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజన

    ప్రజల ప్రమేయం లేకుండా పాలకులు రాష్ట్రాన్ని విభజించారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే విభజన సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే ప్రజలకు కోపం వస్తోందన్నారు. పాలకుల తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతమైనా దీర్ఘకాలంగా వెనుకబాటుకు గురైతే..ఆ పరిణామాలు దేశ విచ్చిన్నం వైపుకు దారితీస్తాయన్నారు. అంతేకాదు ప్రజల్లో తిరుగుబాటు వస్తోందన్నారు.

     హమీలు నెరవేర్చకపోతే అశాంతి

    హమీలు నెరవేర్చకపోతే అశాంతి

    రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిందేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే ప్రజల్లో అశాంతి నెలకొనే అవకాశం ఉందన్నారు. పాలకులు ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే చట్టాలను ఎందుకు పాటించాలనే అభిప్రాయం ప్రజల్లో వస్తోందన్నారు. దీని ద్వారా వేర్పాటు ఉద్యమాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు దేశ సమగ్రతకు నష్టం కల్గిస్తాయన్నారు.

     ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు

    ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు

    రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రానికి నిధుల విషయంలో కేటాయింపుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణేతర ప్రాంత ప్రజలు కొందరు ఇబ్బందులకు గురైన ఘటనలను పవన్ కళ్యాన్ ప్రస్తావించారు. ఈ తరహ ఘటనలు దేశంలోనే తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారనే భావన వస్తోందన్నారు. ఈ పరిణామాలు దేశంలో అశాంతికి కారణమౌతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.

    ఉత్తరాది, దక్షిణాది అనే వాదం

    ఉత్తరాది, దక్షిణాది అనే వాదం

    పాలకులు ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే ప్రజల్లో అసహనానికి కారణంగా మారుతోందన్నారు. ఇప్పటికే దక్షిణాదిపై కొంత చిన్నచూపు ఉందనే భావన కూడ ఉందని ఆయన మాటల సందర్భంలో ప్రస్తావించారు. అయితే ఇదే అసహనం పెరిగిపోతే ఉత్తరాది, దక్షిణాది అనే వాదం బలపడితే దేశ సమగ్రతకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. తాను ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన సందర్బాల్లో ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+