వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో అభిమానుల ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు, ఐనా సంతోషమే!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు తరలి వచ్చిన చాలామంది అభిమానులు నీరుగారిపోయారు. పవన్ అంటే యువతలో మహా క్రేజ్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు తరలి వచ్చిన చాలామంది అభిమానులు నీరుగారిపోయారు. పవన్ అంటే యువతలో మహా క్రేజ్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వారిని తిట్టవచ్చు కానీ, నా కొడుకు బాధపెడితే, జగన్‌ని అడుగుతా: పవన్ కళ్యాణ్వారిని తిట్టవచ్చు కానీ, నా కొడుకు బాధపెడితే, జగన్‌ని అడుగుతా: పవన్ కళ్యాణ్

సదస్సుకు వీరంతా వచ్చారు

సదస్సుకు వీరంతా వచ్చారు

ఉద్ధానం వంటి ముఖ్య సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖ వచ్చారు. సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు మీడియా, విద్యార్థులు, కెజిహెచ్, వైద్యులు, జనసేన ముఖ్య కార్యకర్తలను అనుమతించారు.

Recommended Video

Pawan Kalyan wrote a letter to Party Cadre
అభిమానుల పడిగాపులు

అభిమానుల పడిగాపులు

దీంతో విమానాశ్రయం నుంచి ర్యాలీగా వచ్చిన చాలామంది అభిమానులు, పాసులు లేని కార్యకర్తలు బయటనే ఉండిపోయారు. చాలామంది అభిమానులు ఉదయం తొమ్మిది గంటల నుంచి పవన్ కళ్యాణ్ రాక కోసం వేచి చూశారు. వారు మధ్యాహ్నం ఒకటింటి వరకు ఉన్నారు.

పవన్ కళ్యాణ్ కనిపించకపోయినా..

పవన్ కళ్యాణ్ కనిపించకపోయినా..

మీటింగ్ సందర్భంగా తమ అభిమాన నటుడిని చూడలేకపోయినప్పటికీ, ఆ తర్వాత చూద్దామని ఎండలో, ఆ తర్వాత వర్షంలో నిలబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ కారు దిగకుండానే వెళ్లిపోయారు. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే, పవన్ సినిమా ఫంక్షన్‌కో, మరొకదానికో రాలేదని, ఉద్ధానం వంటి అంశం కోసం డాక్టర్లతో చర్చించేందుకు వచ్చారు. పవన్ తమకు కనిపించకపోయినప్పటికీ, ఆయన వచ్చింది ఓ మంచి పని కోసమని అభిమానులు చెబుతున్నారు.

ఇద్దరిని దత్తత తీసుకున్న జనసేన

ఇద్దరిని దత్తత తీసుకున్న జనసేన

కిడ్నీ వ్యాధి బారినపడిన తల్లిదండ్రుల్ని శ్రీకాకుళం జిల్లా కవిడి మండలానికి చెందిన మనోజ్, మణికంఠలను జనసేన పార్టీ దత్తత తీసుకుంది. ఆ ఇద్దరు పిల్లలను వేదికపై పరిచయం చేశారు. సింపోజియంలో హార్వార్డ్ వైద్యులు జోసఫ్ బోన్ వెంట్రీ, వెంకట సబ్బిసెట్టి, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విసి డా. రవిరాజు తదితరులు వచ్చారు.

English summary
Chairing a symposium on a solution to Uddanam nephropathy, actor and Jana Sena chief Pawan Kalyan in Vishakapatnam said in the presesence of Harvard Medical College's experts that he had always wanted to bring a closur to the flouride contamination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X