సోషల్ మీడియాపై కంట్రోల్: వాళ్ల మైక్ కట్ చేయండి: సభలో పవన్ ఫస్ట్ స్పీచ్
Chintakayala Ayyannapatrudu: ఊహించినట్టే- ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మినహా మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదు.
అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఆ వెంటనే సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ హర్షధ్వానాలను తెలియజేశారు. ఆయన వద్దకు వెళ్లి అభినందనలు తెలియజేశారు.

అనంతరం తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్.. అయ్యన్నపాత్రుడును సగౌరవంగా స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. స్పీకర్ స్థానంలో ఉన్నందున ఇక తిట్టే అవకాశం లేకపోవడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆపే బాధ్యత స్పీకర్‌కే ఉందని, వాళ్ల మైక్‌లను కట్ చేయాలని కోరారు. ఇన్ని రోజులూ రాష్ట్ర ప్రజలు అయ్యన్నపాత్రుడి వాడి వేడి పలుకులు, ఘాటైన వాగ్దాటి చూశారని, ఇప్పుడు హూందాతనం చూస్తారని అన్నారు.

డిబేట్స్ పేరుతో జరిగే రకరకాల పదజాలాన్ని విరజిమ్ముతున్నారని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. గత అయిదు సంవత్సరాల్లో ఎవరైనా తమ అభిప్రాయాన్ని పంచుకుంటే సోషల్ మీడియా ద్వారా వారిపై వ్యక్తిత్వ హననం జరిగేదని, దానికి అడ్డుకట్ట వేయాలని కోరారు.
అలా చేయడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. గతంలో విజయాన్ని తీసుకున్నారని, ఇప్పుడు ఓటమిని అంగీకరించకుండా సభలో నుంచి పారిపోయారని చురకలు అంటించారు. వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారని పవన్ మండిపడ్డారు.
Deputy CM Sri @PawanKalyan First Speech in Andhra Pradesh Legislative Assembly (22-06-24)#PawanKalyanAneNenu #APAssembly pic.twitter.com/CrmMPMXhBN
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2024
అలాంటి సభ కాకుండా.. భవిష్యత్ తరాలకు గీటురాయిలా ఉండేలా సభ కార్యకలాపాలను నిర్వహించాలని ఆయన స్పీకర్‌కు సూచించారు. సభను బూతులు, తిట్లకు పరిమితం చేస్తే పొట్టి శ్రీరాములును అవమానించినట్టవుతుందని పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం సుభిక్షం అయ్యేలా తమ పాలన సాగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications