పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు, బాలయ్య భార్య ప్రచారం

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పర్యటన రద్దయింది. పవన్ మంగళవారం గుంటూరు జిల్లాలోని నరసారావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల అది రద్దయింది.

Pawan Kalyan Guntur tour canceld

వసుంధర ప్రచారం

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రచారం చేస్తున్నారు. ఆమె హిందూపురం పట్టణంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. బాలయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

బాలయ్య రోడ్డు షో

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో బాలకృష్ణ మంగళవారం రోడ్డు షో నిర్వహించారు. సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ టిడిపి అయితే, ఆ లక్ష్య సాధనలో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి పరిటాల రవి అని బాలయ్య అన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ద్వారా బాటలు వేయాలన్నారు.

రాయచోటిలో పురంధేశ్వరి

కడప జిల్లా రాయచోటిలో కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట బిజెపి లోకసభ అభ్యర్థి పురంధేశ్వరి రోడ్డు షో నిర్వహించారు. రాయలసీమ దత్తపుత్రికైన తనను ప్రజలు ఆదరించాలన్నారు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+