మందకృష్ణను ఆకాశానికెత్తేసిన పవన్-అసెంబ్లీలో ఏమన్నారంటే ?

ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలం పోరాటాలు చేసిన దళిత నేత మందకృష్ణ మాదిగను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఆకాశానికెత్తేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇందులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణు మందకృష్ణ చేసిన కృషిని గుర్తుచేశారు.

కులాల కొట్లాటలు, వెనుకబడిన కులాల్లో అత్యంత వెనుక బడిన కులాలు, దేవాలయాల్లో కూడా అడుగుపెట్టనివ్వని పరిస్ధితుల్లో జాతిపిత మహాత్మాగాంధీ వీరిని ముందుకు తీసుకొచ్చారని పవన తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాల మాదిగల ఐక్యతకు జరిగిన ప్రయత్నాలు, చేసిన వ్యక్తుల్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. వర్గీకరణ, క్రిమిలేయర్ గురించి గతంలో చాలా చర్చలు జరిగాయన్నారు.

pawan kalyan hails manda krishna s efforts for sc sub-classification

వర్గీకరణ ఈ స్ధాయికి వచ్చిందంటే దానికి కారణం మందకృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబులే అని పవన్ కళ్యాణ్ తెలిపారు. మాదిగ కులానికి ఆత్మగౌరవం తెచ్చిన మందకృష్ణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. మాదిగ పేరు చెప్పుకునేందుకు ఆలోచించే పరిస్ధితి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆయనదే అన్నారు. అలాగే దేశ స్ధాయిలో వర్గీకరణను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం వర్గీకరణను జనసేన మనస్ఫూర్తిగా సమర్దిస్తున్నట్లు తెలిపారు.

మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడని పవన్ కళ్యాణ్ తెలిపారు. వర్గీకరణ సాధన పోరాట యోధుడని కూడా అన్నారు. అలాగే చంద్రబాబు వర్గీకరణ రూపకర్త అన్నారు. అలాగే ప్రధాని మోడీ వర్గీకరణ ప్రదాత అని పవన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ రిపోర్టు పెట్టినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+