విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏంటీ కాలుష్యం? పట్టించుకోరా?: విశాఖలో ఐటీ స్థలాలను పరిశీలించిన పవన్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నగరంలో కొనసాగుతోంది. విశాఖ మధురవాడలో సర్వే నంబర్‌ 336 కొండపై ప్రభుత్వం వివిధ ఐటీ సంస్ధలకు కేటాయించిన స్ధలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు.

Recommended Video

ఆసక్తికరం గా మారనున్న 2019 ఎన్నికలు
 స్థానికులకే పెద్దపీట

స్థానికులకే పెద్దపీట

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నగరంలో అన్ని అంశాల్లోనూ స్థానికులకే పెద్దపీట వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యోగం తదితర అంశాల్లో ఉత్తరాంధ్రులకు అవకాశాలు ఇవ్వాలని కోరారు.

ప్రాంతీయ బేధం వస్తుంది

ప్రాంతీయ బేధం వస్తుంది

ఇక్కడ నెలకొల్పుతున్న సంస్థల్లో స్ధానికులకు అవకాశాలు కల్పించకుండా స్ధానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంతోనే ప్రాంతీయ బేధం వస్తోందన్నారు. ఇతర దేశాల్లో తక్కువ స్థలంలోనే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు ఇక్కడ పెద్దమొత్తంలో స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఏముందని పవన్‌ ప్రశ్నించారు.

 విమ్స్‌ను సందర్శించిన పవన్

విమ్స్‌ను సందర్శించిన పవన్


ఉత్తరాంధ్రకు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విమ్స్‌ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. విమ్స్ నమూనా, అక్కడ అందిస్తున్న సేవల గురించి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యవరప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డు, ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. గుండె జబ్బుల చికిత్సలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు, నియోనెటాలజీ అండ్ పీడియాట్రిక్, కిడ్నీ బాధితుల సేవలు, స్పోర్ట్స్ ఇంజురీ(ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి)చికిత్సలు ఇలా ఐదు రకాల సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఆరా తీశారు.

ఏంటీ కాలుష్యం? పట్టించుకోరా?

ఏంటీ కాలుష్యం? పట్టించుకోరా?

‘రైల్వే జోన్ తీసుకొస్తామన్నారు అదీ లేదు. కనీసం పోర్ట్ కాలుష్యాన్ని సైతం ఆపలేరా? పోర్ట్ ట్రస్ట్‌తో మాట్లాడి కాలుష్య నియంత్రణకు చర్యలు కూడా తీసుకోలేకపోవడం దారుణం? వీరి నిర్లక్ష్యం వల్ల కేప్‌టౌన్‌ను తలపించే విశాఖలో కాలుష్యం బారిన పడి 4 నుంచి 5 లక్షల మంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అక్కడ నిన్న గంటన్నరపాటు పర్యటిస్తేనే నాకు తలపట్టేసింది. స్థానికులకు న్యాయం జరగకపోతే వేర్పాటువాద ఉద్యమానికి బీజం పడుతుంది. అలాంటి పరిస్థితులు వస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు' పవన్ వ్యాఖ్యానించారు.

సరదాగా బైక్‌పై పవన్

సరదాగా బైక్‌పై పవన్

రిషికొండపై పవన్ కళ్యాణ్ సరదాగా బైక్‌పై చక్కర్లు కొట్టారు. పవన్ అక్కడికి రావడంతో ఆయన వెంట భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా వారితో పవన్ సరదాగా గడిపారు.

English summary
Actor turned politician, JanaSena Party President, Pawan Kalyan, has checked on the pollution rate at the Port Area in Visakhapatnam as a part of his Praja Porata Yatra in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X