జగన్ ఎఫెక్ట్ - ప్రధాని, బీజేపీ స్పందనకు భిన్నంగా పవన్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్ట్. సీఎం జగన్ పై దాడి ఘటనతో రాజకీయ కలకలం మొదలైంది. దాడి జరిగిన తరువాత ప్రధాని మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి దాడిని ఖండించారు. ప్రధాని స్పందన తరువాత చంద్రబాబు దాడిని ఖండించారు. కోడికత్తి పార్ట్ 2 అంటూ టీడీపీ నేతలు లోకేష్ సహా పలువురు విమర్శించారు. ఈ దాడి పైన స్పందించిన పవన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రధాని - బీజేపీ స్పందన
జగన్ పైన దాడి జరిగిన తరువాత ప్రధాని మోదీ స్పందనతో వరుసగా నేతలు స్పందించారు. జగన్ పైన దాడిని ఖండించారు. ప్రధానితో సహా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ సైతం దాడిని ఖండించారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ నేతలు డ్రామాగా ఆరోపణలు చేసారు. నాగబాబు సైతం సెటైరికల్ గా ట్వీట్ చేసారు. పవన్ కల్యాణ్ ఈ ఘటన పైన తెనాలి సభలో స్పందించారు. ప్రధాని సహా బీజేపీ నేతలు దాడిని ఖండించినా...పవన్ మాత్రం డ్రామాగా పేర్కొన్నారుజ. నువ్వే రాయితో కొట్టుకున్నావేమో అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలతో
జగన్ పైన దాడి జరిగిన తరువాత ఖండించాలని తన వద్దకు పార్టీ నేతలు వచ్చారని..కానీ, జరిగిందో లేదో అనే కారణంగా తాను స్పందించలేదన్నారు. జగన్ కు దెబ్బ తాకితే రాష్ట్రానికి తాకినట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికలు రాగానే జగన్ పై దాడి జరుగుతుందని, గతంలో కోడికత్తి దాడి జరిగిందని ఆయన అన్నారు. అదే సభలో ముస్లిం మైనార్టీలకు అభయం ఇచ్చే క్రమంలోనూ పవన్ మరోసారి స్పందించారు. తాము బీజేపీతో కలవటం వల్ల మైనార్టీలకు నష్టం కలుగుతుందని భావిస్తే...జగన్ కోసం ప్రధాని స్పందించారని..అంటే, జగన్ కూడా మోదీతోనే ఉన్నట్లు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ అభ్యంతరం
అయితే, కూటమిలో అధినేతలుగా ఉన్న ప్రధాని మోదీ, చంద్రబాబు ఈ దాడిని ఖండిస్తే పవన్ తీరు మాత్రం భిన్నంగా స్పందించటం బీజేపీలో చర్చకు కారణమవుతోంది. దాడి విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి ఎన్నికల సమయంలో అనుకూలంగా మారే అవకాశం ఉందనే చర్చ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ప్రధాని స్పందించిన తరువాత కూడా పవన్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం ఏంటనేది బీజేపీ నేతల ప్రశ్న. తొలుత చేసిన ట్వీట్ తో విమర్శలు ఎదుర్కొన్న మెగా బ్రదర్ నాగబాబు, తరువాత దాడిని ఖండిస్తూ మరో ట్వీట్ చేసారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications