జగన్ బాటలో పవన్.. ఆందోళనలో ఫ్యాన్స్

ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెరిగింది. 2019 ఎన్నికల్లో 79.74 % పోలింగ్ జరగ్గా..ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం 81 శాతం జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఓటింగ్ శాతం పెరగడంతో ఆ ప్రభావం ఏ పార్టీ మీద పడుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఎన్నికలు ముగయడంతో ఏపీ సీఎం జగన్ విదేశాలకు పయనం అయ్యారు. సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.దీంతో సీబీఐ గతంలోనే విదేశీ పర్యటనలకు వెళ్ళటం జరిగిందని విచారణ జరుగుతుందని.అనుమతి ఇవ్వొద్దని వాదనలు వినిపించింది.దీంతో వాదనలు మొత్తం విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది.తాజాగా మే 14వ తారీకు జగన్ విదేశీ పర్యటనకు కోర్ట్ అనుమతి ఇవ్వటం జరిగింది.దీంతో మే 17 నుంచి జూన్ మొదటి తారీకు వరకు కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌కు వెళ్ళనున్నారు.

Pawan Kalyan is getting ready for a foreign tour

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం విదేశి పర్యటనకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెలలో పవన్ విదేశాలకు వెకేషన్‌కు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఆయన ఎక్కడికి వెళ్తాడనే దానిపై క్లారిటీ లేదు. అలాగే కుటంబసమేతంగా వేళ్తారా సింగిల్‌గా వెళ్తారా అనే విషయం కూడా తెలియరాలేదు. కానీ దాదాపు నెల రోజుల పాటు పవన్ విదేశాల్లో గడిపి జూన్ మధ్యలో తిరిగి వస్తారనేది టాక్ వినిపిస్తోంది. పవన్ వచ్చిన తర్వాత జూన్ చివరి వారంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. పవన్ విదేశాలకు వెళ్తే సినిమా షూటింగ్‌లు ఆలస్యం అవుతున్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+