టీడీపీ గెలుపు - పవన్ వైఖరిలో మార్పు : రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది..!?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. పవన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఏం జరుగుతోంది.
టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రెండు రాయలసీమ నియోజకవర్గాల్లో గెలిచింది. వైసీపీ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో రెండు సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అనేక రకాల విశ్లేషణలకు కారణమవుతున్నాయి. ఈ ఫలితాలతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది.
ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ పై సాధించిన తొలి విజయం కావటం తో నేతలంతా ఖుషీగా ఉన్నారు. కానీ, టీడీపీకి ప్రతీ సందర్భంలో ప్రత్యక్షంగా..పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న పవన్ మాత్రం ఈ ఫలితాలపై స్పందించ లేదు.

జనసేనాని మౌనం వెనుక
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. హోరా హోరీగా సాగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. మూడు స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ ఓటమే తన లక్ష్యమని పదే పదే చెప్పే పవన్ కల్యాణ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన స్పందించలేదు.
వైసీపీ ఓడినా..టీడీపీ గెలిచినా పవన్ స్పందించకపోవటం చర్చకు కారణమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. ఎవరికి వేయాలో మాత్రం చెప్పలేదు. బీజేపీ అభ్యర్దులు మాత్రం తమకు జనసేన మద్దతుతో బరిలోకి దిగామని ప్రచారం చేసుకున్నారు.
బీజేపీ కనీస పోటీ ఇవ్వలేదు. అదే సమయంలో జనసేన ప్రత్యక్షంగా టీడీపీకి మద్దతు ఇవ్వలేదు. లోపాయి కారీగా సహకారం పైన భిన్న వాదనలు ఉన్నాయి.

ఆ నిర్ణయం నచ్చలేదా.. గుర్తించలేదా
ఈ ఎన్నికల్లో జనసేన కంటే పీడీఎఫ్ తో కలిసి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆ నిర్ణయం ఎన్నికల్లో గెలుపుకు టీడీపీకి మేలు చేసింది. ఒప్పందం మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల బదిలీతో మూడు సీట్లలోనూ టీడీపీ గెలుపొందింది. జనసేనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి.
పార్టీ ఆవిర్భావ సభలోనూ పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీతో దూరం పెరగటానికి కారణాలను వివరించారు. అదే సమయంలో వైసీపీ కోరుకున్నది జరగదని.. జనసైనికులు కోరుకుంటున్నదే జరుగుతుందని స్పష్టం చేసారు.
పరోక్షంగా తాము టీడీపీతో పొత్తుతో వెళ్తామని చెబుతూనే.. జనసైనికు లు తాను సీఎం కావాలని కోరుకుంటున్న అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీకి పరోక్షంగా తన సందేశం పంపారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ గెలిచిది. కానీ, పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

పవన్ పట్టు బిగిస్తున్నారా.. ఏం జరుగుతోంది
టీడీపీ మాత్రం పవన్ తో గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనాని పవన్ పిలుపు మేరకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదని చెబుతున్నారు. దీని కారణంగానే టీడీపీ విజయం సాధ్యమైందంటూ మాజీ మంత్రి గంటా విశ్లేషించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పైన పిలుపు ఇచ్చిన జనసేన..ఫలితాల పైన స్పందించకపోవటం వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది.
పొత్తు అధికారికంగా ఖరారు కాకముందే టీడీపీ విజయం పైన స్పందించాల్సిన అవసరం లేదనేది జనసేనాని భావనగా చెబుతున్నారు. అదే సమయంలో జనసేన ఇంకా బీజీపీతో పొత్తులో సాంకేతికంగా కొనసాగుతున్న వేళ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన టీడీపీకి అనుకూలంగా స్పందించటం మంచిది కాదనేది మరో అభిప్రాయంగా వినిపిస్తోంది.
తాను కోరే సీట్లు..పవన్ షేరింగ్ కోసం టీడీపీ పైన పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే పవన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మరి..చంద్రబాబు జనసేనాని కోరిన విధంగా చిట్టా ఆమోదిస్తారా..ఏం జరగుతుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications