వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇతర పార్టీలకు తన మద్దతుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఇతర పార్టీలకు తాను మద్దుతు ఇచ్చే విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఆయన శనివారంనాడు అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.

Recommended Video

అనంతపురం లో పవన్ కళ్యాణ్: సర్వం సిద్ధం

రైతు సమస్యలపై ఆయన ప్రధానంగా తన అనంతపురం పర్యటనలో దృష్టి పెట్టారు. అలాగే అనంతపురం జిల్లా కరువు పరిస్థితులపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు కనిపిస్తున్నారు.

 ఆ పార్టీలకు మద్దతు ఉండదు

ఆ పార్టీలకు మద్దతు ఉండదు

ఎన్నికల ప్రణాళికలను అమలు చేయని రాజకీయ పార్టీలకు తన మద్దతు ఉండదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి మద్దతు ఇచ్చేవారికి తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు..

లక్ష, మంది సైనికులు కావాలి....

లక్ష, మంది సైనికులు కావాలి....

ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తనకు అనంతపురం జిల్లా నుంచి లక్ష మంది సైనికులు కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు అధికారం రాకపోయినా ఫరవాలేదు గానీ రైతు రాజు కావాలని ఆయన అన్నారు. రైతు రాజు కావాలి గానీ బానిస కాకూడదని ఆయన అన్నారు.

వైఫల్యంతోనే అనంత కరువు

వైఫల్యంతోనే అనంత కరువు

ప్రభుత్వాలు, అధికారుల వైఫల్యం వల్లనే అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడేందుకు తనకు లక్ష మంది సైనికులు కావాలని ఆన అన్నారు.

 హంద్రీనీవాపై పవన్ కల్యాణ్

హంద్రీనీవాపై పవన్ కల్యాణ్

హంద్రీనీవా ప్రాజెక్టు చేపల కథలాగా తయారైందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదంటే ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ఆయన అన్నారు.అనంతపురం కరువు తరిమికొట్టే నామసంవత్సరంగా 2019 కావాలని ఆయన అన్నారు.

 ప్రధానికి నివేదిక ఇస్తాం

ప్రధానికి నివేదిక ఇస్తాం

అనంతపురం జిల్లా కరువుపై ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక ఇచ్చేందుకు తాము ఓ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అనంతపురం జిల్లాలోని రైతులు ఢిల్లీ దాకా వెళ్తారని చెప్పారు. రైతు శ్రేయస్సు కోసమే తమ పార్టీ పోరారుతుందని ఆయన చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan made key statement in Ananthapur visit on his support to other parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X