పవన్ అడ్రస్ మారుతోంది...జనసేన అవిర్భావ దినోత్సవం కోసం టీ షర్ట్స్ రిలీజ్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

పవర్ స్టార్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్రస్ త్వరలోనే మారనుంది. అతి త్వరలోనే ఆయన చిరునామా అమరావతికి మారబోతోంది. గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో పవన్ కల్యాణ్ తన కోసం నూతన గృహం నిర్మించుకోబోతున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అక్కడ నూతన గృహ నిర్మాణ పూజ జరగనుంది.

ఉదయం 11.30 గంటలకు భూమి పూజ జరగనున్నట్లు తెలిసింది.ఈ పూజా కార్యక్రమానికి జనసేనాని కుటుంబసమేతంగా హాజరవుతారు. అలాగే అతికొద్ది మంది ముఖ్యులని మాత్రమే పవన్ ఈ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం.ఖాజాలో రెండు ఎకరాల విస్తీర్ణంలో పవన్ నివాసం నిర్మితం కానున్నట్లు తెలిసింది.

Pawan Kalyan to Lay Foundation for His House In Andhra Pradesh

మరోవైపు ఈ నెల 14 వ తేదీన జరిగే జనసేన అవిర్భావ దినోత్సవ సభకు తరలివచ్చే జనసేన కార్యకర్తల కోసం ఆ పార్టీ ప్రత్యేక టీ షర్ట్ లు విడుదల చేసింది. సభకు తరలిరండని ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆదివారం నుంచి నుంచి వాట్సాప్, పేస్‌బుక్ డీపీలుగా ఈ ఫోటో పెట్టుకోండంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఫోటోతో కూడిన ఓ ఫోటో విడుదల చేశారు. మరోవైపు మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్పవం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pawan Kalyan is going to lay foundation stone for his new house in Guntur, near Khaja Toll Gate in Guntur district. Pawan Kalyan is going to perform puja tomorrow morning at 11. 30 am along with his family. According to sources, he is going to construct his new house in 2 acres of land in Khaja, between Vijayawada & Guntur.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి