పవన్ రాజకీయంలో బిగ్ అప్డేట్ - రంగం సిద్దం..!?
జనసేనాని పవన్ కీలక ప్రకటకను సిద్దం అవుతున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రారంభించిన వారాహి తొలి విడత యాత్ర ఈ రోజుతో ముగియనుంది. భీమవరం సభలో పవన్ పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను చేసే స్థానం పైన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా దక్కకుండా చూస్తామని చెబుతున్న పవన్..ఇక్కడే పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
భీమవరంలో పవన్
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తొలి విడత ఈ రోజుతో పూర్తి కానుంది. జ్వరంతో బాధపడుతున్న పవన్ భీమవరం నియోజకవర్గంలోని పలు బీసీ వర్గాలతో సమావేశం అయ్యారు. తాజాగా శెట్టి బిలజ సంఘాల నేతలతో సమావేశమైన పవన్.. గౌడ కులస్థుడు సీఎం కావాలని జనసేన కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. బీసీ కులాలన్నీ ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చారు.

ఏదో ఒకరోజు గౌడ కులస్థులు రాజ్యాధికారం చేపట్టాలని..సర్ధార్ గౌతు లచ్చన్నలా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. జనసేనను విశ్వసించాలని కోరారు. నమ్మకం కలిగితే మద్దతు ఇవ్వాలని అభ్యర్ధించారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కట్టుబడి ఉన్నామని పవన్ హామీ ఇచ్చారు.
పోటీ స్థానంపై ప్రకటనకు ఛాన్స్
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసారు. రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. తిరిగి గోదావరి జిల్లాల్లోని ఒక స్థానంతో పాటుగా తిరుపతి నుంచి పోటీకి దిగుతారనే అంచనాలు ఉన్నాయి. గతంలో భీమవరం నుంచి పోటీ చేయటంతో ఈ సారి తూర్పు గోదావరి పిఠాపురం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే, వచ్చే ఎన్నికల్లో తిరిగి భీమవరం నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ ఓడారో...తిరిగి అక్కడే తిరిగి గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం. ఈ మేరకు ఈ రోజు భీమవరంలో జరిగే వారాహి తొలి విడత ముగింపు సభలో పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
పవన్ ఏం చెప్పబోతున్నారు
భీమవరం లో ఓటమి గురించి పలు సందర్భాల్లో పవన్ ప్రస్తావన చేసారు. భీమవరం లో ఉన్న సామాజిక లెక్కలు...సమీకరణాలు పవన్ గెలుపు ఖాయమనే అంచనాలు వినిపించాయి. కానీ, అక్కడ వైసీపీ అభ్యర్ది విజయం సాధించారు. ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పోలింగ్ అయిందని పవన్ పలు మార్లు ఆరోపణలు చేసారు.

పవన్ పశ్చిమ గోదావరి నుంచే పోటీ చేయాలని..అదే జిల్లా వాసుల కోరిక అంటూ తాజాగా మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య జనసేనానికి లేఖ రాసారు. ఇందుకోసం మూడు నియోజకవర్గాలు సూచించారు. అందులో భీమవరం నుంచి పోటీ చేయాలని కోరారు. పవన్ తన పోటీ స్థానం ఎందుకు ప్రకటించరనే చర్చ సాగుతున్న ఈ సమయంలో భీమవరం కేంద్రంగా పవన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications