టీడీపీతో పొత్తు కోసం ఎన్ని తిట్లు తిన్నానో

Pawan Kalyan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ పర్యటనలను ముమ్మరం చేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించారు. ఆయా జిల్లాల నాయకులతో విస్తృత సమావేశాలను నిర్వహించారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. ఈ ఉదయం ఆయన భీమవరానికి వచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం గురించి వారికి వివరించారు. ఎన్నికల ఖర్చుపైనా మాట్లాడారు.

Pawan Kalyan made key remarks on alliance with TDP

భారతీయ జనతా పార్టీ కూడా తమ కూటమిలో కలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని అన్నారు.

తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి విజయాన్ని ఏ శక్తి కూడా ఆపలేదని అన్నారు పవన్ కల్యాణ్. జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడే ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు మూడు పార్టీలు కూటమి కట్టాయని పేర్కొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్నామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీని ఓడిపోయే పార్టీగా అభివర్ణించారు. ప్రజలు కోరుకున్న విధంగా మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan made key remarks on alliance with TDP

2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందని, అయినా నిలబడ్డామని పవన్ కల్యాణ్ అన్నారు. అయిదు సంవత్సరాల పాటు అధికారంలో తెలుగుదేశం పార్టీ.. 2019 ఎన్నికల్లో చతికిలపడిందని, కష్టాలపాలైందని చెప్పారు. పాపం.. కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన జనసేన చెయ్యందించి పైకి లేపిందని అన్నారు.

డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేయలేమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థి ఎన్నికల ఖర్చును 45 లక్షల రూపాయలకు పెంచిందని అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయలేమని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. కార్యకర్తలకు కనీసం భోజనాలు పెట్టడానికైనా డబ్బులు కావాల్సి ఉంటుందని అన్నారు.

టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎంత నలిగిపోయానని వ్యాఖ్యానించారు. రెండు చేతులు జోడించి, దండం పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ జాతీయ స్థాయి నాయకులను అడిగానని గుర్తు చేసుకున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో ఎన్నో చీవాట్లు తిన్నానో ఎవరికీ తెలియదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+