వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్య ప్రతిపాదన: అమిత్ షాతో పవన్ భేటీ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో జనసేన దళపతి, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన అమిత్ షా బేగంపేటలోని టూరిజం హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్‌వో అమిత్‌ షాను రాత్రి 10.45 గంటల ప్రాంతంలో పవన్‌ కలిశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థమవుతోంది.

మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పవన్‌ కళ్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బిజెపి, టిడిపి భావిస్తున్నాయి.

అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో జన సేన నేరుగా బరిలోకి దిగుతుందా, లేదా అనేది తెలియదు. అలాగే బిజెపి, టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతారా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)‌, మజ్లిస్‌లను దీటుగా ఎదుర్కొనవచ్చని అమిత్‌షా, పవన్‌ భేటీలో ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ‘

జిహెచ్ఎంసిలో విజయం సాధించాలంటే కలిసి రావాలని పవన్ కళ్యాణ్‌ను అమిత్‌షా అనునయించినట్లు తెలిసింది. భేటీ అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసే మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందన్నారు. ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడు బయటపెట్టలేనని చెప్పారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను కలవడానికి వచ్చినప్పుడు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇలా..

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమై రహస్య చర్చలు జరిపారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చలు జరిపారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఓ ప్రతిపాదన వచ్చిందని, అది రహస్యమని ఆయన చెప్పారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

టూరిస్టులా ఉండాలని అనుకుంటున్నాడేమో అని కెసిఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మీడియా వద్ద స్పందించారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో భేటీ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా విద్వేషాలు రెచ్చగొట్టడం సరి కాదని ఆయన కెసిఆర్‌పై వ్యాఖ్యానించారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మధ్య జరిగిన భేటీని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

చంద్రబాబు, కెసిఆర్ ఇంకా ముందుగానే చర్చల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

అమిత్ షాతో పవన్

అమిత్ షాతో పవన్

ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి రెండు నెలలు మాత్రమే అయినందున తాను వాటిపై వ్యాఖ్యానించలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీ ప్రాక్టికల్‌గా మాట్లాడుతారని ప్రశంసించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan has met BJP national president Anit Shah at tourism hotel in Hyderbad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X