Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుతో పవన్ భేటీ - సీట్ల మార్పు, కీలక నిర్ణయం..!!

ఎన్నికల వేల చంద్రబాబు - పవన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రెండు పార్టీలు తమ అభ్యర్థుల పై తుది నిర్ణయానికి వచ్చారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో బీజేపీ నుంచి స్పష్టత రాకపోవటంతో తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ నుంచి కొన్ని మార్పులతో తాజా ప్రతిపాదనలు అందాయి. దీంతో, ఆ ప్రతిపాదనల్లో అమోదం, సీట్ల మార్పు..అభ్యర్థుల ఖరారు పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక,ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిమధ్య చర్చ సాగుతోంది.

ప్రచారం పైనే చర్చ : హైదారాబాద్ వేదికగా చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన సీట్ల పైన చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు కొన్ని మార్పులు సూచిస్తున్నారు. మరో ఎమ్మెల్యే సీటు కోరుతున్నారు. వైజాగ్ పార్లమెంట్ సీటు పైన పట్టబడుతున్నారు. బీజేపీ తమ సీట్లను ప్రకటించకపోవటంతో టీడీపీ, జనసేన తమ తుది జాబితా ప్రకటించేందుకు వేచి చూస్తున్నాయి. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో పైనా వీరిద్దరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముసాయిదా మేనిఫెస్టో సిద్దం చేసి బీజేపీ నేతలతో చర్చ తరువాత విడుదల చేయాలని అధినేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిమధ్య చర్చ సాగుతోంది.

Pawan Kalyan meets chandra Babu to finlise the candidates and election campaign route map

సీట్ల సర్దుబాటు : చంద్రబాబు మార్చి 25, 26 తేదీల్లో కుప్పం నుంచి తన ప్రచారం ప్రారంబించనున్నారు. పవన్ కల్యాన్ ఈ నెల 27 నుంచి కీలక స్థానాల్లో పర్యటనకు సిద్దమయ్యారు. తన వారాహి ద్వారా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. హైదారాబాద్ నుంచి మంగళగిరికి వారాహిని తరలిస్తున్నారు. ముందుగా ఉత్తరాంధ్రలో ప్రచారం మొదలు పెట్టి గోదావరి జిల్లాల్లో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు. జగన్ కు దీటుగా మేనిఫెస్టో ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై వీరిద్దరు చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిమధ్య చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరు కలిసి పాల్గొనే మీటింగులతో పాటుగా ఎవరెక్కడ ఫోకస్ చేయాలనేది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan meets chandra Babu to finlise the candidates and election campaign route map

మేనిఫెస్టో కు తుది రూపు : జనసేన - టీడీపీ పొత్తుల్లో ఖరారైన సీట్లలో రెండు చోట్ల మార్పులుంటాయని సమాచారం. తిరుపతి, మదనపల్లి సీట్లలో నిర్ణయం జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. జగన్ 27వ తేదీ నుంచి ప్రచారం మొదలు పెట్టనుండటం తో వీరిద్దరూ సైతం పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. రేపు రెండు పార్టీల నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే అబ్యర్దుల జాబితా ప్రకటించనున్నారు. జగన్ టార్గెట్ గా.. మేనిపెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పవన్ కల్యాన్ ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరి లో ప్రచారం పైన ఫోకస్ చేయనున్నారు. చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో కొనసాగేలా ప్లాన్ చేసారు. బీజేపీ తో కలిసి ఉమ్మడి ప్రచారం పైన మరోసారి కమలం పార్టీ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+