చెప్పలేదు: పవన్ కళ్యాణ్‌తో ఉండవల్లి భేటీ, బాబు-మోడీ గొడవ తెంచుతారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారోనని, విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దాలనుకుంటున్నారో ఆయనను కలిస్తే గానీ చెప్పలేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం అన్నారు.

  Pawan Kalyan Has Proposed Fact Finding Committee

  సాయంత్రం జనసేనానితో పార్టీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పైవిధంగా మాట్లాడారు. ఏపీ సమస్యలపై పోరాడేందుకు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లిలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామని పవన్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జేపీతో పవన్ భేటీ అయ్యారు. ఆదివారం ఉండవల్లితో భేటీ అవుతున్నారు.

  జేఏసీ తర్వాత జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ

  జేఏసీ తర్వాత జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ

  ఉండవల్లి, పవన్ కళ్యాణ్‌ల భేటీలో జేఏసీ, జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు అంశాలపై చర్చ సాగనుంది. అలాగే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో నిజానిజాలు తెల్చేందుకు జాయింట్ ఫ్యాక్ట్స్ పైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ చెబుతున్నారు.

  ఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతే

  నిధులపై లెక్క తేల్చేందుకు

  నిధులపై లెక్క తేల్చేందుకు

  విభజనతో నష్టపోయిన ఏపీకి చాలా నిధులు ఇచ్చామని బీజేపీ చెబుతోంది. విభజన చట్ట ప్రకారం ఇవ్వాల్సినంత ఇవ్వలేదని టీడీపీ చెబుతోంది. దీంతో కేంద్రం నెరవేరుస్తున్న హామీలు ఏమిటి, ఇచ్చిన నిధులు ఎంత.. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నిజం ఎంత అనే అంశాలపై ఉండవల్లి, పవన్ చర్చించనున్నారు.

  బీజేపీపై బాబు 'చేరికల' అసహనం: సాయంపై ట్విస్ట్, లెక్కతో ఇరకాటంలో బాబు, కొత్త ప్రశ్నలు!

  ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే

  ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే


  విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో తేల్చేందుకు సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడం అత్యవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శనివారం ట్విటర్‌లో స్పందించారు. ఆర్థికశాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు, విశ్రాంత అధికారులు, విద్యావేత్తలు, మేధావులు, నాయకులు ఈ కమిటీలో ఉండాలన్నారు.

  కేంద్ర, రాష్ట్ర భిన్నవాదనలను తేల్చేందుకు

  కేంద్ర, రాష్ట్ర భిన్నవాదనలను తేల్చేందుకు

  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భిన్న వాదనల్లోని నిజానిజాలను ఈ కమిటీ తేల్చాలన్నారు. విభజన చట్టం ఇచ్చిన హామీలు ఎంతవరకు సాకారమయ్యాయో, ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ, సిద్ధాంతపరమైన ఆపేక్ష లేకుండా నిష్పక్షపాతంగా ఈ సంయుక్త కమిటీ తేల్చాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాజకీయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో సంయుక్త రాజకీయ కమిటీ నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan meet Former MP Undavalli Arun Kumar in hyderabad on Sunday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి