ఆగిపోయిన పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్?
రాజకీయ పార్టీని నడిపించాలంటే పెద్దస్థాయిలో ధనం అవసరమవుతుంది. ఆ ఇంధనం కోసం వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బహిరంగంగా చాలాసార్లు ఈ విషయాన్ని ఆయనే చెబుతుంటారు. ఎన్నికల సంవత్సరం కావడంతో జనసేనను పూర్తి సంసిద్ధం చేయాలంటే అందుకు తగ్గట్లుగానే డబ్బులు అవసరమవుతాయి. ఈ కారణంతోనే పవన్ వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
బ్రో సినిమా ఫలితం మిక్స్డ్ గా రావడంతో హరీష్ శంకర్ దర్శకత్వంలోని ఉస్తాద్ భగత్ సింగ్ ను త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈలోగా ఉస్తాద్ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా బిజీగా ఉండటం, వారాహి యాత్ర చేయాల్సి ఉండటంతో వాస్తవానికి హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రెండింటినీ ఎన్నికలైన తర్వాతే అనుకున్నారు. అయితే బ్రో ఫలితం తర్వాత పవన్ వ్యూహం మార్చారు.

పవన్ ఓజి సినిమా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని, దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆగిపోతుందంటూ రకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఉస్తాద్ నిర్మాతలైన మైత్రీమూవీ మేకర్స్ నవీన్ యెర్నేని స్పందించారు. సినిమా ఆగిపోలేదని, ఎటువంటి ఆటంకం లేకుండా సినిమా షూటింగ్ జరుపుకుంటోందని ప్రకటించారు. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్లు పవర్ ఫుల్లుగా ఉండబోతున్నాయని గతంలోనే దర్శకుడు హరీష్ శంకర్ క్లూ ఇచ్చారు. కీలకమైన షెడ్యూల్ కోసం 10 రోజులు కాల్షీట్లు ఇస్తే చాలని హరీష్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి జనసేనాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications