అజ్ఞాతవాసివి అజ్ఞానపు పలుకులు.. జనసేన ఓ ప్రీపెయిడ్ పార్టీ: ఏపీ మంత్రులు
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యపూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాసరావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అజ్ఞాతవాసి వెలుగులోకి వచ్చి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని, ఇతరుల స్క్రిప్టులు చదివి తమపై బురద చల్లుతున్నాడని కేఈ విమర్శించారు.
సినిమా స్క్రిప్టుకు , రాజకీయాలకు పవన్ తేడా తెలుసుకోవాలని గంటా ఆయనకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి సీఎంను తిట్టడమేంటని ఆయన మండిపడ్డారు. బీజేపీ.. భారతీయ జగన్ సేన పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

అయ్యన్నపాత్రుడు:
పవన్‌కు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విమర్శించారు. ప్రధాని మోడీ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాకో డైలాగ్ చెప్పినట్టు పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విప్ బుద్దా వెంకన్న విమర్శించారు. చిత్తశుద్ది లేనివాళ్ల మాటలకు విలువ లేదని అన్నారు. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్.. పవన్ కల్యాణ్‌ది ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications