పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ కలయిక: చంద్రబాబుకు దెబ్బనే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలయిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ విషయంపై రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంంది.

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా...ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ..

తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనను దూరం పెట్టారనే అభిప్రాయం బలంగా ఉంది. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా టిడిపితో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

అయితే, తాను ఎల్లవేళలా తమ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ఎన్టీఆర్ చెప్పారు. అయితే, ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్‌కు పవన్ కల్యాణ్ హాజరు కావడం రాజకీయాల్లో ఓ సంచలనమైన వార్తనే అయింది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దెబ్బనే అంటున్నారు.

ఎన్టీఆర్ ఇలా....

ఎన్టీఆర్ ఇలా....

రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆసక్తి ఉందనేది అందరికీ తెలుసు. అయితే, ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు. ఆయన సమయం ఉందని, ఈలోగా సాధ్యమైనంత మేరకు ప్రజలను ఆకట్టుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాతే రాజకీయాలపై దృష్టి పెడుతారనే ప్రచారం ఉంది. దాంతో టిడిపికి దూరంగానే ఉండాలని ఆయన అనుకుంటున్నారు.

నారా లోకేష్ కోసం....

నారా లోకేష్ కోసం....

తెలుగుదేశం పార్టీలో తన వారసుడిగా తన తనయుడు నారా లోకేష్‌ను నిలబెట్టాలనే వ్యూహంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారనే ప్రచారం ఉంది. అందుకు అనుగుణంగా నారా లోకేష్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ దూసుకు పోతున్నారు. ఇప్పుడు పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేషే అయ్యారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించే పాత్ర కూడా ఏమీ ఉండదు. దానికితోడు, జూనియర్ ఎన్టీఆర్‌కు బాబాయ్ బాలకృష్ణ కూడా దూరంగానే ఉంటున్నారు. ఆ స్థితిలో రాజకీయాలను పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నారు.

పవన్ కల్యాణ్ ఇలా...

పవన్ కల్యాణ్ ఇలా...

పవన్ కల్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి, వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలనే ఉద్దేశంతో కార్యాచరణను కూడా రూపొందించుకుంటున్నారు. ఆయన రాజకీయాలపై చాలా సీరియస్‌గానే ఉన్నట్లు ఇటీవల జరిగిన సమావేశం కూడా తెలియజేస్తోంది. ఇందుకు ఆయన అన్ని వర్గాల మద్దతు కూడా ఆశిస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమా వేడుకకు పవన్ కల్యాణ్ వెళ్లడం వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

త్రివిక్రమ్‌తో సాన్నిహిత్యమేనా...

త్రివిక్రమ్‌తో సాన్నిహిత్యమేనా...

నిజానికి, పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యుల సినిమా వేడుకలకు కూడా ఎప్పుడో గానీ హాజరు కావడం లేదు. ప్రత్యేకంగా ఎన్టీఆర్ సినిమా వేడుకలకు హాజరు కావడం వెనక దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉన్న అనుబంధం కారణం కావచ్చునని అంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాతో త్రివిక్రమ్‌తో పవన్ కల్యాణ్‌కు అనుబంధం పెరిగిందనేది అంటున్నారు. ఇప్పుడు మరో సినిమా కూడా చేస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితులైనవారు, తనకు ఇష్టులైనవారు ఏదైనా అడిగితే కాదనే తత్వం పవన్ కల్యాణ్‌ది కాదు.

అభిమానులకు సంకేతాలు..

అభిమానులకు సంకేతాలు..

జూనియర్ ఎన్టీఆర్ సినిమా వేడుకకు పవన్ కల్యాణ్ ఏ కారణం చేత వెళ్లినా రాజకీయంగా సంకేతాలు మాత్రం వెళ్తాయి. ఎన్టీఆర్ అభిమానులకు అది పరోక్ష సంకేతంగా భావించవచ్చునని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమానులు పవన్ కల్యాణ్ వెంట ర్యాలీ కావడానికి ఇది నాంది అవుతుందని అంటున్నారు. ఇది చంద్రబాబుకు పెద్ద దెబ్బగానే పరిణమించవచ్చు. అయితే, పవన్ కల్యాణ్ బలం పుంజుకుంటున్న కొద్దీ ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి చంద్రబాబుకు ఉపయోగపడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దానివల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ దెబ్బ తిన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan and Nandamuri hero Jr NTR may change political equations in Andhra Pradesh.
Please Wait while comments are loading...